Surendra Koli | నిఠారీ వరుస హత్యల కేసు.. సురేందర్ కోలీ ఆత్మహత్య
Surendra Koli | నోయిడాలోని నిఠారీ గ్రామంలో 2006లో జరిగిన వరుస హత్యల కేసులో (Nithari serial killings) నిర్దోషిగా తేలిన సురేందర్ కోలీ (Surendra Koli) సూసైడ్ చేసుకున్నారు.
Surendra Koli | త్రినేత్ర.న్యూస్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసులో (Nithari serial killings) నిర్దోషిగా తేలిన సురేందర్ కోలీ (Surendra Koli) సూసైడ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 50 ఏళ్లు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ (Haridwar)లో తాను నిర్వహిస్తున్న ఒక టీ స్టాల్ వద్ద ఉరివేసుకుని కనిపించాడు. దీంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు.
2006 డిసెంబర్‌లో నోయిడాలోని నిఠారీ గ్రామంలో చిన్నారులు, మహిళల వరుస హత్యలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సెక్టార్-31లో ఉన్న వ్యాపారవేత్త మోనిందర్ సింగ్ పాంధేర్ బంగ్లా వెనుక ఉన్న డ్రైనేజీలో దాదాపు 19 మందికిపైగా చిన్నారులు, మహిళల అస్తిపంజరాలు, పుర్రెలు, బట్టలు లభ్యమవడం కలకలం రేపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు మోనిందర్‌తోపాటూ అతడి ఇంట్లో వంటవాడిగా పనిచేస్తున్న కోలీని అరెస్ట్ చేసింది.
2007-2010 మధ్య సీబీఐ హత్య, కిడ్నాప్, అత్యాచారం, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి 19 కేసులు నమోదు చేసింది. సురీందర్ కోలీకి పలు కేసుల్లో కోర్టు మరణశిక్ష విధించగా, పాంధేర్‌కు ఇతర కేసుల్లో మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డాయి. 2007లో కోలీకి దాదాపు ఉరిశిక్ష అమలు చేసే పరిస్థితి కూడా వచ్చింది. అయితే, చివరి నిమిషంలో దాఖలైన పిటిషన్‌తో మరణశిక్షను కోర్టు నిలిపివేసింది. ఇక అక్టోబర్ 2023లో ఈ వరుస హత్యల కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. సరైన సాక్ష్యాధారాలు చూపించడంలో సీబీఐ విఫలమైందనే కారణంతో కోలీతో పాటు అతని యజమాని మోనిందర్ సింగ్ పాంధేర్‌ను నిర్దోషులుగా విడుదల చేస్తూ ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేసింది. ఇక 2025 నవంబరులో సుప్రీంకోర్టు చివరి పెండింగ్ కేసులో కూడా కోలీని నిర్దోషిగా విడుదల చేస్తూ తీర్పు చెప్పింది. దీంతో అతను హరిద్వార్‌కు వెళ్లి అక్కడ టీ స్టాల్‌ను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఉరేసుకొని విగతజీవిగా కనిపించడం కలకలం రేపుతోంది.
Also Read..
ఫుట్‌బాల్ Vs ఎన్వలప్.. తృణమూల్ కాంగ్రెస్‌కు కొత్త పేరు, గుర్తు
కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన మలయప్ప.. పరవరించిన భక్తజనం..!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rawat | ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాక్.. పదవుల నుంచి తప్పుకున్న మాజీ సీఎం
సెప్టెంబర్ 12, 2026

Mallikarjun Kharge | 24 రోజులైంది.. చర్యలేవి..? వేదిక శుద్ధీకరణపై నడ్డాకు ఖర్గే లేఖ
సెప్టెంబర్ 3, 2026

Char Dham Yatra | చార్ధామ్ Helicopter యాత్రకు ఎలా నమోదు చేసుకోవాలో తెలుసా?
సెప్టెంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Godawari Pushkaraalu-Cabinet sub committee meeting | రోజుకు 1,568 బస్సులు.. 6,740 రౌండ్ల ట్రిప్పులు
- ●Tollywood | ఆడవాళ్లను డామినేట్ చేసే సినిమా కాదు - మగాళ్లు జిందాబాద్ టైటిల్‌పై హీరో కామెంట్స్
- ●TMC | ఫుట్‌బాల్ Vs ఎన్వలప్.. తృణమూల్ కాంగ్రెస్‌కు కొత్త పేరు, గుర్తు
- ●Harish Rao | భయపడుకుంటూ రాకండి.. నేన్ ఇక్కడే ఉన్నా.. దగ్గరుండి మీకు అన్నీ చూపిస్తా
- ●MLA Manohar Reddy | మిషన్ భగీరథ నీళ్లే మాకు దిక్కు
- ●iPhone 18 Pro | ఐఫోన్ 18 ఫోన్ల కోసం భారత్‌లో భారీ క్రేజ్.. ఢిల్లీలో యాపిల్ ప్రేమికుల బారులు..

Godawari Pushkaraalu-Cabinet sub committee meeting | రోజుకు 1,568 బస్సులు.. 6,740 రౌండ్ల ట్రిప్పులు

Tollywood | ఆడవాళ్లను డామినేట్ చేసే సినిమా కాదు - మగాళ్లు జిందాబాద్ టైటిల్‌పై హీరో కామెంట్స్

TMC | ఫుట్‌బాల్ Vs ఎన్వలప్.. తృణమూల్ కాంగ్రెస్‌కు కొత్త పేరు, గుర్తు

Harish Rao | భయపడుకుంటూ రాకండి.. నేన్ ఇక్కడే ఉన్నా.. దగ్గరుండి మీకు అన్నీ చూపిస్తా



