16 రోజుల్లో 2500 కి.మీ… రామేశ్వరం నుంచి అయోధ్యకు యువకుడి సైకిల్ యాత్ర
Rameswaram To Ayodhya | శ్రీరాముడు రామేశ్వరం నుంచి అయోధ్యకు (Rameswaram To Ayodhya) చేసిన ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు (Noida) చెందిన ఓ యువకుడు సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తిచేశారు.
Rameswaram To Ayodhya | త్రినేత్ర న్యూస్: రావణుడిని వధించిన రాముడు(Sri Rama).. సీతమ్మ సమేతంగా అయోధ్యకు చేరుకుంటారు. ఈ సందర్భంగా అయోధ్యాపురి (Ayodhya) ప్రజలు దీపాల కాంతులతో సీతారాములకు ఆహ్వానం పలుకుతారు. 14 ఏండ్ల వనవాసాన్ని పూర్తిచేసుకుని రాఘవుడు తిరిగిరావడంతో.. ఇంటింటా దీపాలు వెలిగించి సంతోషం వ్యక్తంచేస్తారు. నాడు రావణ (Ravana) వధ తర్వాత శ్రీరాముడు రామేశ్వరం నుంచి అయోధ్యకు (Rameswaram To Ayodhya) చేసిన ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు (Noida) చెందిన ఓ యువకుడు సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తిచేశారు.
నోయిడాకు చెందిన 30 ఏండ్ల సార్థక్ చౌహాన్ (Sarthak Chauhan) తమిళనాడు (Tamil Nadu) నుంచి ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) వరకు సుమారు 2,500 కిలోమీటర్ల దూరాన్ని 16 రోజుల్లో సైకిల్‌పై ప్రయాణించారు. ఏడు రాష్ట్రాల మీదుగా సాగిన ఆయన ప్రయాణం శుక్రవారం అయోధ్యకు చేరుకుంది. ఈ సందర్భంగా సార్థక్ మాట్లాడుతూ.. వరుసగా మూడో ఏడాది ఈ సుదీర్ఘ యాత్రను చేస్తున్నానన్నారు. భారతదేశ వైవిధ్యాన్ని, సంస్కృతిని ప్రత్యక్షంగా చూడటానికి ఇది అద్భుతమైన మార్గమని తెలిపారు. దశమి నాడు రామేశ్వరంలో ప్రార్థనలు చేసి యాత్ర ప్రారంభించానని, దీపావళి (Deepavali) సమయానికి అయోధ్యకు చేరుకున్నానని వెల్లడించారు.

గతంలో తన సైక్లింగ్ బృందంతో కలిసి వచ్చానని, ఈసారి ఒంటరిగా ప్రయాణించానని తెలిపారు. వచ్చే ఏడాది తన బృందానికి చెందిన దాదాపు 50 మంది సైకిలిస్టులతో (Cycled) కలిసి రామేశ్వరం నుంచి అయోధ్యకు సైకిల్ యాత్ర చేయనున్నామని పేర్కొన్నారు. అయోధ్య ఏటా మరింత ప్రకాశవంతంగా మారుతున్నదని తెలిపారు. దేశంలో, ముఖ్యంగా యూపీలో శాంతిభద్రతలు ఎంతగానో మెరుగుపడ్డాయని చెప్పారు. గతంలో భయంతో ఒంటరి ప్రయాణం ఊహించలేకపోయానని, ఇప్పుడు పగలు-రాత్రి తేడా లేకుండా ఒంటరిగా ధైర్యంగా ప్రయాణించగలుగుతున్నానని వెల్లడించారు. దీపోత్సవం ఇప్పుడు కేవలం ఉత్తరప్రదేశ్‌కే పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి ఒక పండుగగా మారిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు

Diwali 2026 | దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి?.. లక్ష్మీ పూజ శుభ ముహూర్తం, 5 రోజుల క్యాలెండర్, పూజా విధానం ఇదే..!
నవంబర్ 3, 2026

Supreme Court | అయోధ్య విరాళాల కేసు విచారణను ముగించిన సుప్రీంకోర్టు
నవంబర్ 2, 2026

Priyanka Chopra | అమెరికాలో ప్రియాంక చోప్రా దీపావళి వేడుకలు – ఫొటోలు చూశారా?
అక్టోబర్ 31, 2026
తాజావార్తలు
- ●Diwali Bonus | ఒక్కొక్కరికి రూ.లక్ష.. ఉద్యోగులకు గుజరాత్ వ్యాపారి దీపావళి బోనస్
- ●Diwali 2026 | దీపావళి పూజలో కమల పుష్పానికే ఎందుకంత ప్రాధాన్యం?
- ●Diwali Car Buying | దీపావళికి కొత్త కారు కొంటున్నారా? మీ రాశి ప్రకారం ఏ రంగు కారు మంచిదో తెలుసుకోండి!
- ●Diwali 2026 | దీపావళి వేళ.. లక్ష్మీదేవితో పాటు అలక్ష్మికీ ఓ దీపం వెలిగించండి..!
- ●LK Advani | శత వసంతంలోకి అడుగుపెట్టిన ఎల్కే అద్వానీ
- ●Happy Deepavali | త్రినేత్ర న్యూస్ పాఠకులు, శ్రేయోభిలాషులకు.. దీపావళి శుభాకాంక్షలు

Diwali Bonus | ఒక్కొక్కరికి రూ.లక్ష.. ఉద్యోగులకు గుజరాత్ వ్యాపారి దీపావళి బోనస్

Diwali 2026 | దీపావళి పూజలో కమల పుష్పానికే ఎందుకంత ప్రాధాన్యం?

Diwali Car Buying | దీపావళికి కొత్త కారు కొంటున్నారా? మీ రాశి ప్రకారం ఏ రంగు కారు మంచిదో తెలుసుకోండి!

Diwali 2026 | దీపావళి వేళ.. లక్ష్మీదేవితో పాటు అలక్ష్మికీ ఓ దీపం వెలిగించండి..!



