త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజ‌య‌వాడ దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్

Talasani Srinivas Yadav | మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ (Talasani Srinivas Yadav) విజ‌య‌వాడ శ్రీక‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. కుటుంబ స‌మేతంగా విజ‌య‌వాడ వెళ్లిన త‌ల‌సాని ఆదివారం ఉద‌యం అమ్మ‌వారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక‌పూజ‌లు చేశారు.

G

Hyderabad | Published On Jul 26, 2026, 2.40 pm IST

Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజ‌య‌వాడ దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
Advertisement

Talasani Srinivas Yadav | త్రినేత్ర‌.న్యూస్‌: మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ (Talasani Srinivas Yadav) విజ‌య‌వాడ శ్రీక‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. కుటుంబ స‌మేతంగా విజ‌య‌వాడ వెళ్లిన త‌ల‌సాని ఆదివారం ఉద‌యం అమ్మ‌వారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక‌పూజ‌లు చేశారు. అనంత‌రం అర్చ‌కులు వేద మంత్రాల‌తో ఆశీర్వ‌దించారు. ఆల‌యం వెలుప‌ల మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మ తల్లి దీవెనలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించానన్నారు. ఆషాఢ‌ మాసం (Ashada Masam) అంటే తెలంగాణలో (Telangana) ఒక పండుగ, బోనాలు సంబురాలు (Bonalu) అంబరాన్ని అంటుతాయ‌ని చెప్పారు. ఆడబిడ్డలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తార‌ని వెల్ల‌డించారు.

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మకు (Kanakadurgamma) 17 సంవత్సరాలుగా బోనం సమర్పించడం ఆనవాయితీగా వ‌స్తున్న‌ద‌ని తెలిపారు. అమ్మవారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందన్న భక్తుల విశ్వాసమ‌ని చెప్పారు. ఎల్ నినో (El Nino) ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయాని, అమ్మవారి చల్లని దీవెనలు తెలుగు రాష్ట్రాలపై ఉండాల‌న్నారు. విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉండాల‌ని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement