TGPSC | టీజీపీఎస్సీ నిర్లక్ష్యం.. రోడ్లపై ఓఎంఆర్ షీట్లు ప్రత్యక్షం
TGPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్( TGPSC ) నిర్లక్ష్యం బయటపడింది. మెహిదీపట్నం పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ల వెంట ఓఎంఆర్ షీట్లు ప్రత్యక్షం కావడంతో అటు అభ్యర్థులు, ఇటు నిరుద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
TGPSC | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్( TGPSC ) నిర్లక్ష్యం బయటపడింది. మెహిదీపట్నం పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ల వెంట ఓఎంఆర్ షీట్లు ప్రత్యక్షం కావడంతో అటు అభ్యర్థులు, ఇటు నిరుద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై టీజీపీఎస్సీ తక్షణమే స్పందించి వివరణ ఇచ్చింది.
శనివారం రాత్రి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 230 నుంచి 240 మధ్య టీజీపీఎస్సీ రాతపరీక్షలకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లు ప్రత్యక్షమయ్యాయి. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అవి 2018 నాటి హాస్టల్ వార్డెన్ పరీక్షలకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లని నిరుద్యోగులు నిర్ధారించారు.
ఈ అంశంపై టీజీపీఎస్సీ కూడా తక్షణమే స్పందించింది. 2018 నాటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలకు చెందినవని కమిషన్ స్పష్టం చేసింది. ఆ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఎప్పుడో విజయవంతంగా పూర్తయిందని తెలిపింది. సాధారణంగా పరీక్షలు ముగిసి మూడేళ్లు దాటిన ఓఎంఆర్ షీట్లను నిబంధనల ప్రకారం ష్రెడ్డింగ్ (ముక్కలుగా కత్తిరించడం) చేస్తామని, ఈ క్రమంలోనే పాత షీట్లు బయటకు వచ్చి ఉంటాయని పేర్కొంది.
అయినప్పటికీ, భద్రతా వలయాన్ని దాటి పబ్లిక్ ప్లేస్‌లోకి ఈ పాత ఓఎంఆర్ షీట్లు ఎలా వచ్చాయనే అంశంపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు కమిషన్ అధికారులు తెలిపారు. మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా కఠిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sreeleela | శ్రీలీల, సాయిపల్లవి తమిళ మూవీ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే - రజనీకాంత్‌కు పోటీగా!
- ●Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
- ●Rainfall | హైదరాబాద్‌లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు
- ●Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు
- ●Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం
- ●Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు

Sreeleela | శ్రీలీల, సాయిపల్లవి తమిళ మూవీ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే - రజనీకాంత్‌కు పోటీగా!

Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్

Rainfall | హైదరాబాద్‌లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు

Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు



