Rainfall | హైదరాబాద్‌లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు
Rainfall | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వేసవిని తలపిస్తున్నాయి. వానాకాలం అయినప్పటికీ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురియడం లేదు. దీంతో నగర వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది.
Rainfall | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వేసవిని తలపిస్తున్నాయి. వానాకాలం అయినప్పటికీ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురియడం లేదు. దీంతో నగర వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. ఈ కారణంగా ఎండలు దంచికొడుతున్నాయి. పగలు, రాత్రి వేళ భారీగా ఉష్ణోగ్రతలు నమోదై నగర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నాలుగైదు రోజుల క్రితం మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
టీజీడీపీఎస్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 33.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అంబర్‌పేట ఏరియాలో 32.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, రాజధానికి సమీపంలో ఉన్న సూర్యాపేట జిల్లాలో 38.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదై స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ మండుటెండలకు లోటు వర్షపాతమే కారణమని టీజీడీపీఎస్ వెల్లడించింది.
ఇక జూన్ 1 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌లో కేవలం 152.3 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈ సమయంలో సాధారణంగా 255.8 మి.మీ. వర్షపాతం నమోదు కావాలి. అంటే 40 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 59 శాతం, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో 15 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ వెల్లడించింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Karthik Reddy | బహదూర్‌గూడా రైతుల పరిస్థితి ప్యారడైజ్ సినిమా లెక్కనే ఉంది
- ●TGPSC | టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 13 వరకు నియామక పరీక్షలు
- ●Telangana Graduate MLC Voter Registration | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు షురూ: అర్హతలు ఇవే.. ఫోన్ నుంచే ఫారమ్-18 కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి
- ●MLA Sanjay | ప్రమీల చాలా మంది పసిబిడ్డలను కాపాడారు
- ●Asian Games | ఆసియా గేమ్స్‌లో దాయాదుల సమరం.. అక్టోబర్ 1న హైవోల్టేజ్ మ్యాచ్
- ●Ashika Ranganath | ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ - అజిత్ సినిమా నుంచి శ్రీలీల ఔట్ - కన్నడ బ్యూటీకి ఛాన్స్

Karthik Reddy | బహదూర్‌గూడా రైతుల పరిస్థితి ప్యారడైజ్ సినిమా లెక్కనే ఉంది

TGPSC | టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 13 వరకు నియామక పరీక్షలు

Telangana Graduate MLC Voter Registration | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు షురూ: అర్హతలు ఇవే.. ఫోన్ నుంచే ఫారమ్-18 కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

MLA Sanjay | ప్రమీల చాలా మంది పసిబిడ్డలను కాపాడారు



