Train Hits School Van | ఘోర ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీ కొట్టిన రైలు.. పలువురు మృతి
Train Hits School Van | బెంగాల్ (West Bengal)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెరిచి ఉన్న రైల్వే గేట్ వద్ద పట్టాలు దాటుతున్న స్కూల్ వ్యాన్‌ను ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది (Train Hits School Van). ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Train Hits School Van | పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ వ్యాన్‌ను ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది (Train Hits School Van). ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ముర్షిదాబాద్ (Murshidabad) జిల్లాలోని కర్ణసువర్ణ రైల్వే క్రాసింగ్ (Karna Subarna station) వద్ద శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం పాఠశాలల పిల్లలతో వెళ్తున్న వ్యాన్ తెరిచి ఉన్న రైల్వే గేట్ వద్ద పట్టాలు దాటుతుండగా అకస్మాత్తుగా వచ్చిన ఓ ప్యాసింజర్ రైలు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరు పాఠశాల విద్యార్థులని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఓ సైక్లిస్ట్ సహా పలువురు గాయపడ్డారు. స్కూల్ వ్యాన్ మొత్తం నుజ్జునుజ్జు అయింది.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Also Read..
పిల్లలను బావిలో తోసి.. ఆపై తానూ దూకి తల్లి ఆత్మహత్య
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఐటీ స్టాక్‌లలో భారీగా కొనుగోళ్లు..
హైదరాబాద్‌లో బాలికలు, మహిళలపై నానాటికీ పెరుగుతున్న నేరాలు..
సంబంధిత వార్తలు

Uniforms | డెంగీ భయం.. బాలికలు స్కర్ట్స్ ధరించొద్దన్న మంత్రి
సెప్టెంబర్ 5, 2026

TMC Office | కోల్‌కతాలోని టీఎంసీ ఆఫీస్‌పై దాడి.. బీజేపీ గూండాల పనే అన్న అభిషేక్ బెనర్జీ
సెప్టెంబర్ 3, 2026

BJP MLA | సీపీఎం విమర్శలను తిప్పికొట్టకుండా.. రీల్స్, సెల్ఫ్ ప్రమోషన్లో బిజీ.. .. సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే విమర్శలు
సెప్టెంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Global Summit | ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానించండి.. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్ సమీక్ష
- ●Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు.. ఏసీబీకి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్
- ●TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు
- ●Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం
- ●TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం
- ●OU Convocation | రేపే ఓయూ స్నాతకోత్సవం.. సాయంత్రం 6 గంటలకు కూడా అందని ఐడీ కార్డులు

Global Summit | ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానించండి.. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్ సమీక్ష

Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు.. ఏసీబీకి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్

TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు

Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం



