త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ఓటు తీసేస్తే సిటిజన్ షిప్ తొలగించినట్టు కాదు : సుప్రీంకోర్టు

Supreme Court | ఓట‌ర్ల జాబితా నుంచి పేరును తొల‌గించినంత‌మాత్రాన సిటిజ‌న్ షిప్ (citizenship status) కోల్పోయిన‌ట్లు కాద‌ని సుప్రీంకోర్టు (Supreme Court) స్ప‌ష్టం చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే తుది అధికారం భారత ఎన్నికల సంఘానికి (ECI) లేదని తేల్చి చెప్పింది.

D

National | Published On Jul 17, 2026, 5.06 pm IST

Supreme Court | ఓటు తీసేస్తే సిటిజన్ షిప్ తొలగించినట్టు కాదు : సుప్రీంకోర్టు
Advertisement

Supreme Court | ఓట‌ర్ల జాబితా నుంచి పేరును తొల‌గించినంత‌మాత్రాన సిటిజ‌న్ షిప్ కోల్పోయిన‌ట్లు కాద‌ని సుప్రీంకోర్టు (Supreme Court) స్ప‌ష్టం చేసింది. గ‌తంలో బీహార్ SIR తీర్పులో తాము ఈ విషయాన్ని స్పష్టం చేశామని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే తుది అధికారం భారత ఎన్నికల సంఘానికి (ECI) లేదని తేల్చి చెప్పింది.

SIR ప్రక్రియ ద్వారా తొలగించబడిన వ్యక్తుల అప్పీళ్లను విచారించడానికి ఏర్పాటు చేసిన అప్పీలేట్ ట్రిబ్యునళ్లలో విచారణ ప్రక్రియను క్రమబద్ధీకరించాలని కోరుతూ ప్రసేన్‌జిత్ బోస్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించిన అనేక మంది అప్పీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పటికీ వారికి రేషన్, నగదు బదిలీ, ఇతర సంక్షేమ పథకాల లబ్ధిని బెంగాల్ ప్ర‌భుత్వం నిలిపివేస్తోంద‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు సుమారు 38 వేల అప్పీలు మాత్రమే పరిష్కారమయ్యాయని, ఇంకా 34 లక్షల అప్పీలు ట్రైబ్యునళ్ల ముందు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ‘‘అప్పీలు ఇంకా విచారణలో ఉన్నప్పుడు పౌరులను సంక్షేమ పథకాల నుంచి ఎలా దూరం చేస్తారు?’’ అని ఆయన ప్రశ్నించారు. స‌ర్‌లో పేరు లేనివారికి కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను కూడా నిరాక‌రిస్తున్నార‌ని కోర్టుకు చెప్పారు. ఓట‌రు జాబితాలో పేరు కోల్పోయిన వారికి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు నిలిపివేయ‌కుండా ప్ర‌భుత్వానికి ఆదేశాలు ఇవ్వాల‌ని కోరారు.

ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనాతో కూడిన‌ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటరు జాబితాలో పేరు లేదనే కారణంతో రేషన్, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నిలిపివేయడం స‌రికాద‌ని పేర్కొంది. అదే స‌మ‌యంలో పౌరసత్వాన్ని నిర్ణయించే తుది అధికారం భారత ఎన్నికల సంఘానికి (ECI) లేదని తేల్చి చెప్పింది. ఓటింగ్ హక్కులపై నిర్ణయం తీసుకునే అధికారం మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఒకరి పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం ఈసీకి లేద‌ని తెలిపింది. పౌరసత్వ చట్టం కింద ఈ అంశాన్ని తుది పరిష్కారం కోసం సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లే బాధ్యత ఈసీఐపై ఉంటుందని స్ప‌ష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం (ECI), పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

Also Read..

ఇక స్విగ్గీలోనే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్.. నిమిషాల్లోనే డెలివ‌రీ..

స్టీల్ బ్యాంక్ ప‌ర్యావ‌ర‌ణ‌ విప్ల‌వంతో ప‌చ్చ హుస్నాబాద్ సాకారం

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్.. తెల్లారి 4.30 వ‌ర‌కు బార్లు, క్ల‌బ్బులు తెరిచే ఉంటాయ్..

Advertisement
Advertisement