Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు
Ramchander Rao | లోక్‌సభకు, శాసనసభకు పోటీ చేసే కనీస వయసును తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రంగా స్పందించారు. కనీస వయసు తగ్గించే అంశం బీజేపీ పరిధిలో ఉండదు.. అది ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని ఆయన తెలిపారు.
Ramchander Rao | త్రినేత్ర.న్యూస్ : లోక్‌సభకు, శాసనసభకు పోటీ చేసే కనీస వయసును తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రంగా స్పందించారు. కనీస వయసు తగ్గించే అంశం బీజేపీ పరిధిలో ఉండదు.. అది ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని ఆయన తెలిపారు. అయితే రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయని విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు.
ఓటు హక్కు వయస్సు, ఎన్నికల నిబంధనలు వంటి అంశాలను నిర్ణయించే అధికారం భారత ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. ఇటువంటి అంశాలపై ప్రజలను, ముఖ్యంగా యువతను తప్పుదారి పట్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధికి తగదు అని హెచ్చరించారు.
అదేవిధంగా, రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. పేద, మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల చదువుల కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం కావడంతో విద్యార్థులు తమ విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రామచందర్ రావు నిప్పులు చెరిగారు.
ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా ఇతర అంశాలపై దృష్టి మళ్లించడం సరైంది కాదు. విద్యార్థుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మేము కోరుతున్నామని రామచందర్ రావు తెలిపారు.
తాజావార్తలు
- ●Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం
- ●Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు
- ●Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
- ●Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం

Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం

Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు

Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ

Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్





