త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OU Degree Results | విడుద‌ల కాని ఓయూ ‘డిగ్రీ’ ఫ‌లితాలు.. ‘లా’ అడ్మిష‌న్ల‌కు ఇక్క‌ట్లు..

OU Degree Results | 2026-27 విద్యాసంవ‌త్స‌రం ప్రారంభ‌మై నెల రోజులు అవుతున్న‌ప్ప‌టికీ ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఫైన‌ల్ ఇయ‌ర్ డిగ్రీ ఫ‌లితాల‌ను ఇప్ప‌టికీ విడుద‌ల చేయ‌లేదు. దీంతో టీజీ లాసెట్ ప్ర‌వేశాల‌కు ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయి.

S

Telangana | Published On Jul 21, 2026, 5.27 pm IST

OU Degree Results | విడుద‌ల కాని ఓయూ ‘డిగ్రీ’ ఫ‌లితాలు.. ‘లా’ అడ్మిష‌న్ల‌కు ఇక్క‌ట్లు..
Advertisement

OU Degree Results | త్రినేత్ర‌.న్యూస్ : 2026-27 విద్యాసంవ‌త్స‌రం ప్రారంభ‌మై నెల రోజులు అవుతున్న‌ప్ప‌టికీ ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఫైన‌ల్ ఇయ‌ర్ డిగ్రీ ఫ‌లితాల‌ను ఇప్ప‌టికీ విడుద‌ల చేయ‌లేదు. దీంతో టీజీ లాసెట్ ప్ర‌వేశాల‌కు ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో లా కోర్సుల్లో ప్ర‌వేశాలు పొందాల‌నుకునే అభ్య‌ర్థుల‌కు నిరీక్ష‌ణ త‌ప్ప‌డం లేదు.

ఎందుకంటే.. మూడేళ్ల లా కోర్సు చేయాల‌నుకునే విద్యార్థులు క‌చ్చితంగా డిగ్రీ పాసై ఉండాలి. రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో డిగ్రీ మార్క్స్ మెమోతో ఇత‌ర వివ‌రాల‌ను న‌మోదు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్ప‌టికీ ఓయూ డిగ్రీ ఫ‌లితాలు విడుద‌ల కాలేదు.

వాస్త‌వానికి లా కోర్సుల రిజిస్ట్రేష‌న్ల‌కు జూలై 10వ తేదీ వ‌ర‌కే గ‌డువు ఉండే. కానీ డిగ్రీ ఫ‌లితాల విడుద‌ల‌లో ఆల‌స్యం కార‌ణంగా.. ఆ గ‌డువును జూలై 20 వ‌ర‌కు పొడిగించారు. అయితే జూలై 15 నాటికి డిగ్రీ ఫైన‌ల్ ఇయ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌వుతాయ‌ని ఓయూ ఎగ్జామినేష‌న్ బ్రాంచి అధికారులు గ‌తంలో వెల్ల‌డించారు. 21వ తేదీ వ‌చ్చినా కూడా ఫ‌లితాల విడుద‌ల‌లో జాప్యం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో టీజీ లాసెట్ అధికారులు రిజిస్ట్రేష‌న్ గ‌డువును మ‌రోసారి పొడిగించారు. తాజాగా జూలై 28వ తేదీ వ‌ర‌కు పొడిగించిన‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు.

స‌వరించిన షెడ్యూల్ ఇలా..

రిజిస్ట్రేష‌న్ల‌కు గ‌డువు - జూలై 28
ఫేజ్ 1 వెబ్ ఆప్ష‌న్స్ - జూలై 28 నుంచి 31 వ‌ర‌కు
ఎడిట్ వెబ్ ఆప్ష‌న్స్ - ఆగ‌స్టు 1
సీట్ల కేటాయింపు - ఆగ‌స్టు 5
కాలేజీల్లో రిపోర్టింగ్ - ఆగ‌స్టు 8 నుంచి 10 వ‌ర‌కు

Advertisement
Advertisement