Sreeleela | శ్రీలీల, సాయిపల్లవి తమిళ మూవీ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే – రజనీకాంత్‌కు పోటీగా!
సాయిపల్లవి, శ్రీలీల కలిసి ఫస్ట్ టైమ్ ఓ సినిమా చేస్తోన్నారు. ఓం పేరుతో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియన్ మూవీలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. అక్టోబర్ 16న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ కాబోతుంది. రజనీకాంత్ జైలర్ 2కు పోటీగా ఓం థియేటర్లలోకి రానుండటం ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On Jul 26, 2026, 2.50 pm IST
Sreeleela | దక్షిణాది టాప్ హీరోయిన్లు సాయిపల్లవి, శ్రీలీల కలిసి ఫస్ట్ టైమ్ ఓ సినిమా చేయబోతున్నారు. ఓం ఛాప్టర్ వన్ పేరుతో రూపొందుతోన్న ఈ మూవీలో ధనుష్ హీరోగా నటించాడు. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఓం సినిమాలో మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఆదివారం వెల్లడించారు. ఆక్టోబర్ 16న థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది.
రజనీకాంత్ వర్సెస్ ధనుష్...
ఓం సినిమాకు రెండు రోజుల ముందు అక్టోబర్ 14న రజనీకాంత్ జైలర్ 2 మూవీ రిలీజ్ అవుతోంది.మాజీ మామ అల్లుళ్ల మధ్య బాక్సాఫీస్ పోరు కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. గతంలో 2020 సంక్రాంతి టైమ్‌లో ధనుష్ పటాస్, రజనీకాంత్ దర్బార్ సినిమాలు ఒకే వారంలో రిలీజయ్యాయి. ఈ రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ సారి పోరులో ఎవరూ విన్నర్‌గా నిలుస్తారన్నది ఉత్కంఠగా మారింది.
కాంబినేషన్...
మారి 2 తర్వాత ధనుష్ సాయిపల్లవి కాంబినేషన్‌లో వస్తోన్న సెకండ్ మూవీ ఇది. ఇందులో సాయిపల్లవి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఛాలెంజింగ్‌గా ఆమె పాత్ర సాగుతుందని అంటున్నారు. ధనుష్ ప్రియురాలిగా శ్రీలీల నటిస్తోంది. అమరన్ మూవీ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియాసామీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ సమకూర్చుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది. ఎర్రచందనం అక్రమ రవాణా బ్యాక్‌డ్రాప్‌లో ఓం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇరవై రోజుల గ్యాప్‌లో....
ఓం రిలీజైన రెండు, మూడు వారాల గ్యాప్‌లోనే సాయిపల్లవి బాలీవుడ్ మూవీ రామాయణ థియేటర్లలోకి రాబోతుంది. దాదాపు 1100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీలో రణభీర్ కపూర్ హీరోగా నటించాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ramayana | సీతగా సాయిపల్లవి ఎలా కనిపిస్తుందో తెలియదు : దీపికా చిఖ్లియా
జులై 25, 2026

Ramayana Trailer | విద్యార్థుల నిరసనల ఎఫెక్ట్ – రామాయణ ట్రైలర్ వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా?
జులై 24, 2026

Nayanthara | రజనీకాంత్ ఏరియాలో కొత్త ఇల్లు కొన్న నయనతార – లగ్జరీ డూప్లెక్స్ ధర వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
జులై 24, 2026
తాజావార్తలు
- ●Servant Theft Cases | పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దు.. మనం ఇచ్చే అవకాశమే నేరానికి కారణం: వీసీ సజ్జనార్
- ●Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
- ●Rainfall | హైదరాబాద్‌లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు
- ●TGPSC | టీజీపీఎస్సీ నిర్లక్ష్యం.. రోడ్లపై ఓఎంఆర్ షీట్లు ప్రత్యక్షం
- ●Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు
- ●Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం

Servant Theft Cases | పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దు.. మనం ఇచ్చే అవకాశమే నేరానికి కారణం: వీసీ సజ్జనార్

Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్

Rainfall | హైదరాబాద్‌లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు

TGPSC | టీజీపీఎస్సీ నిర్లక్ష్యం.. రోడ్లపై ఓఎంఆర్ షీట్లు ప్రత్యక్షం



