త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Palash Muchhal | మ‌రోసారి చిక్కుల్లో ప‌లాష్ ముచ్చ‌ల్‌..! స్మృతి చిన్న‌నాటి ఫ్రెండ్ ఫిర్యాదుతో కేసు న‌మోదు..!

P

National | Published On May 6, 2026, 10.56 am IST

Palash Muchhal | మ‌రోసారి చిక్కుల్లో ప‌లాష్ ముచ్చ‌ల్‌..! స్మృతి చిన్న‌నాటి ఫ్రెండ్ ఫిర్యాదుతో కేసు న‌మోదు..!
Advertisement

Palash Muchhal | టీమిండియా వుమెన్ స్టార్ క్రికెట్ స్మృతి మంధాన మాజీ బాయ్‌ఫ్రెండ్ ప‌లాష్ ముచ్ఛ‌ల్ మ‌రోసారి వివాదంలో చిక్కుకున్నాడు. సంగ్లీకి చెందిన విఘ్యాన్ ప్రకాష్ మానే ఫిర్యాదు పోలీసులు కేసు న‌మోదు చేశారు. స్మృతి మంధాన‌, మానే ఇద్ద‌రు బాల్య స్నేహితులుగా తెలుస్తోంది. న‌వంబ‌ర్ 22న సంగ్లీ-అష్టారోడ్‌లోని టోల్ ప్లాజా వ‌ద్ద ఇద్ద‌రికి వాగ్వాదం జ‌రిగింది. ఈ స‌మ‌యంలో ప‌లాష్ త‌న‌పై కులం పేరుతో దూషించిన‌ట్లుగా మానే ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు ఎస్సీ-ఎస్టీ చ‌ట్టంలోని సెక్షన్ 3(1)తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసు వెనుక ఆర్థిక వివాదం సైతం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఓ సినిమా ప్రాజెక్ట్ కోసం విఘ్యాన్ మానే నుంచి పలాష్ ముచ్చల్ రూ.25 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని మానే చెప్ప‌డంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మానే మీడియాతో మాట్లాడుతూ ఆరు నెల‌ల్లో సినిమా పూర్తి చేస్తామ‌ని చెప్పార‌ని, అలా జ‌రుగ‌లేద‌ని ఆరోపించారు. తీసుకున్న డ‌బ్బు ఇవ్వాల‌ని అడిగితే త‌ప్పించుకునే ప్ర‌య‌త్నించార‌ని.. చివ‌ర‌కు నిల‌దీస్తే అనుచిత ప‌ద‌జాలంతో దూషించాడ‌ని వాపోయారు.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో పలాష్ ముచ్చల్, స్మృతి మంధానాల రిలేష‌న్ వార్త‌లు మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చాయి. ఇద్దరూ గతంలో నిశ్చితార్థం చేసుకుని, 2025 నవంబర్‌లో సంగ్లీలో వివాహం చేసుకోవాలని నిర్ణ‌యించుకున్నారు. ఆ పెళ్లికి కొద్ది గంట‌ల ముందే ర‌ద్దు చేసుకున్నారు. ఆ త‌ర్వాత కొద్దిరోజుల‌కు పెళ్లిని ర‌ద్దు చేసుకున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. ఇందుకు కార‌ణాలు మాత్రం వెల్ల‌డించ‌లేదు. మానే ఫిర్యాదు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

Advertisement
Advertisement