Janhvi Kapoor | ఆమె శరీరం…ఆమె నిర్ణయం…డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ – తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
చుట్టమల్లే సాంగ్ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ రియాక్ట్ అయ్యింది. డీప్ ఫేక్ వీడియోలు లైంగిక వేధింపులతో సమానమని అన్నది. మహిళకు ఆమె శరీరానికి గౌరవం ఇవ్వాలన్నది చాలా కష్టమైన విషయంగా పరిగణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె పోస్ట్ వైరల్ అవుతోంది.
Entertainment | Published On Oct 5, 2026, 11.24 am IST
Janhvi Kapoor |దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్ మార్ఫింగ్ వీడియోపై టాలీవుడ్ భగ్గుమంటోంది. హీరోయిన్ జాన్వీకపూర్‌ను అసభ్యకరంగా చిత్రీకరించిన తీరుపై స్టార్ హీరోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్ఫింగ్ వీడియోలను క్రియేట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ చిరంజీవి, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండతో పాటు పలువురు అగ్ర కథానాయకులు పోస్ట్‌లు పెట్టారు. వారికి అభిమానులు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఈ డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ కూడా రియాక్ట్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌లో తెలుగు డైరెక్టర్ల తీరును కూడా జాన్వీ కడిగేసింది.
లైంగిక వేధింపులతో సమానం...
ఏఐ సాయంతో మహిళలను కించపరిచేలా కంటెంట్‌ను క్రియేట్ చేయడం, దానిని షేర్ చేయడం లైంగిక వేధింపులతో సమానం. సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్క నటి ఏదో ఒక రూపంలో ఇలాంటి వేధింపులకు ప్రతిరోజు గురవుతూనే ఉంది. ఓ మహిళ ఐదు రోజులు సరే అని చెప్పి ఆరో రోజు వద్దు అని అంటే ఆ వద్దును గౌరవించాలన్నది చాలా మందికి అర్థం కావడం లేదు. మహిళకు, ఆమె శరీరానికి గౌరవం ఇవ్వాలన్నది కూడా చాలా ప్రాథమికమైన విషయం. కానీ దానికి చాలా మంది కష్టమైందిగా పరిగణిస్తున్నారు.
అభ్యంతరకరమైన యాంగిల్స్...
ఓ మహిళ మినీ స్కర్ట్ ధరించిందంటే....అభ్యంతరకరమైన యాంగిల్స్‌లో ఫొటోలు, వీడియోలు తీయడానికి అనుమతి ఇచ్చినట్లు కాదు. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలి...ఆమె హద్దులు ఏంటి అన్నది పూర్తిగా ఆమెకు సంబంధించిన వ్యక్తిగత నిర్ణయాలు. ఓ మహిళ శరీరానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే హక్కు ఆమెకు మాత్రమే ఉంటుంది.
నిరంతరం పోరాటం...
మహిళలు తమ భద్రత కోసం ఇప్పటికీ నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ఇబ్బందికరచూపులు, జడ్లిమెంట్లు, హద్దులు, రాజీలు ఇంకా కొనసాగుతూనే ఉండటం బాధకారం. ఈ సమస్యలకే పరిష్కారాలు కనుగొనలేని పరిస్థితుల్లో డిజిటల్ భయాలు కొత్తగా వారిని వెంటాడుతోన్నాయి. ఏది తప్పో ఏది ఒప్పో ధైర్యంగా చెప్పే పురుషులు నుంచే మార్పు మొదలవుతుందని అందరూ అర్థం చేసుకోవాలి.
కొండంత ధైర్యం....
ఈ డీప్‌ఫేక్ వ్యవహారంపై బలంగా తన వాయిస్‌ను వినిపించడమే కాకుండా తక్షణమే స్పందించిన ఎన్టీఆర్ సర్‌కు ధన్యవాదాలు.కోట్లాది మంది అభిమానించే ఓ వ్యక్తి ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడినప్పుడు...ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్న ప్రతి మహిళలో అది కొండంత ధైర్యాన్ని నింపుతుంది. ఇలాంటి నీచమైన చర్యలను ఖండిస్తూ మద్దతుగా నిలిచిన చిరంజీవి సర్‌తో పాటు విజయ్, ఖుష్బూ మేడమ్‌లకు ధన్యవాదాలు. ఒక మహిళను మనిషిగా చూడమని, గౌరవించమని కోరడం నిజంగా అంత పెద్ద కోరికా. ఆమె శరీరం...ఆమె నిర్ణయం అంటూ ఈ పోస్ట్‌లో జాన్వీకపూర్ పేర్కొన్నది.
ఇన్‌డైరెక్ట్‌గా ఈ స్టేట్‌మెంట్ ద్వారా తెలుగు డైరెక్టర్లపై కూడా జాన్వీ సెటైర్లు వేసినట్లుగా కనిపిస్తోంది. దేవర, పెద్ది సినిమాలో ఆమె పాత్రను చూపించిన తీరుపై దారుణంగా విమర్శలొచ్చాయి. డైరెక్టర్ల మైండ్‌సెట్ గురించి కూడా ఈ పోస్ట్‌లో డిస్కస్ చేసినట్లు నెటిజన్లు చెబుతోన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay Deverakonda | లైంగిక దాడితో సమానం …జాన్వీకపూర్ డీప్‌ఫేక్ వీడియోపై విజయ్ దేవరకొండ రియాక్షన్
అక్టోబర్ 4, 2026

Singeetham Srinivasa Rao | చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో సింగీతం సినిమాలు – అనౌన్స్మెంట్తోనే సంచలనం ..కానీ…
అక్టోబర్ 4, 2026

Janhvi Kapoor |జాన్వీకపూర్ డీప్ ఫేక్ వీడియో – ఎవరిని వదిలిపెట్టనంటూ జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..
- ●MrBeast | రూ.9 కోట్ల కోసం.. మొత్తం గ్రాసరీ స్టోర్ తినేయాలట..
- ●Rakul Preet Singh | నేను ఎవరి బినామీని కాదు - నాకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు - ఐటీ సోదాలపై రకుల్ పోస్ట్
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. మార్పు లేకుండా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..
- ●CJP | దేశమంతా కదులుతుంది.. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు..?
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..

MrBeast | రూ.9 కోట్ల కోసం.. మొత్తం గ్రాసరీ స్టోర్ తినేయాలట..

Rakul Preet Singh | నేను ఎవరి బినామీని కాదు - నాకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు - ఐటీ సోదాలపై రకుల్ పోస్ట్

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. మార్పు లేకుండా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..



