త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | శ్రీలీల‌కు అచ్చిరాని బాలీవుడ్ – డెబ్యూ మూవీ ఆగిపోయిన‌ట్లేనా?

శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ ఆషికీ 3 మూవీ మ‌ధ్య‌లోనే ఆగిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాను అనౌన్స్‌చేసి ఏడాది దాటిపోయినా ఇప్ప‌టివ‌ర‌కు 40 శాతం మాత్ర‌మే షూటింగ్ పూర్త‌య్యింద‌ట‌. ఔట్‌పుట్‌తో పాటు శ్రీలీల‌, కార్తీక్ ఆర్య‌న్ కెమిస్ట్రీ విష‌యంలో మేక‌ర్స్ అసంతృప్తిగా ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆషికీ 3ని ప‌క్క‌న‌పెట్టాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్న‌ట్లు చెబుతున్నారు.

N

Entertainment | Published On Jul 3, 2026, 3.43 pm IST

Sreeleela | శ్రీలీల‌కు అచ్చిరాని బాలీవుడ్ – డెబ్యూ మూవీ ఆగిపోయిన‌ట్లేనా?
Advertisement

Sreeleela | హ్యాట్రిక్ డిజాస్ట‌ర్ల‌తో టాలీవుడ్‌కు దూర‌మైంది శ్రీలీల‌. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ప‌రాశ‌క్తితో త‌మిళంలోకి తొలి అడుగు వేసింది. శివ‌కార్తికేయ‌న్ హీరోగా నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా కూడా శ్రీలీల‌కు హిట్టు తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. మొద‌టి సినిమానే ఫెయిల్యూర్‌గా నిల‌వ‌డంతో కోలీవుడ్‌లోనూ శ్రీలీల‌పై ఐరెన్‌లెగ్ అనే ముద్ర ప‌డింది. క‌నీసం బాలీవుడ్‌లోనైనా హిట్టు కొట్టి త‌న‌పై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాల‌ని చాలా రోజులుగా ఎదురుచూస్తోంది. కానీ అక్క‌డ కూడా నిరాశే మిగిలిన‌ట్లు తెలుస్తోంది. శ్రీలీల హిందీ డెబ్యూ మూవీ థియేట‌ర్ల‌లోకి రాక‌ముందే ఆగిపోయింద‌ని అంటున్నారు.

తూ మేరీ జింద‌గీ హై....

కార్తీక్ ఆర్య‌న్ హీరోగా అనురాగ్ బ‌సు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాతో శ్రీలీల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ఆషికీ ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్‌గా రాబోతున్న ఈ సినిమాకు తూ మేరీ జింద‌గీ హై అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమాను అనౌన్స్‌చేసి ఏడాది దాటిపోయింది. క‌నీసం 40 శాతం కూడా షూటింగ్ కంప్లీట్ కాలేద‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కు తీసిన ఫుటేజ్ విష‌యంలో మేక‌ర్స్ అసంతృప్తిగా ఉన్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. స్క్రిప్ట్‌లో చాలానే మార్పులు చేర్పులు చేశార‌ట డైరెక్ట‌ర్‌. అయినా కూడా అనుకున్న స్థాయిలో క‌థ‌ రాలేద‌ని , దాంతో ఆషికీ 3ని ప‌క్క‌న‌పెట్టాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించుచుకున్నార‌ట‌.

అంచ‌నాలు భారీగా...

కార్తీక్ ఆర్య‌న్‌, శ్రీలీల కెమిస్ట్రీ కూడా స‌రిగ్గా వ‌ర్క‌వుట్ కాలేద‌ని అంటున్నారు. ఆషికీ, ఆషికీ 2 బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. ఆ ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్ వ‌స్తుంద‌న‌గానే ఆడియెన్స్‌లో అంచ‌నాలు భారీగానే ఏర్ప‌డ్డాయి. క‌థ విష‌యంలో ఏ మాత్రం అటు ఇటు అయినా విమ‌ర్శ‌లు గ‌ట్టిగానే వ‌చ్చే అవ‌కాశం ఉంది. స్క్రిప్ట్ విష‌యంలోనే కాంప్ర‌మైజ్ కావ‌డం కంటే సినిమాను మ‌ధ్య‌లో ఆపేయ‌డ‌మే మంచిద‌ని మేక‌ర్స్ ఫిక్సైన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. అందుకే చాలా రోజులుగా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ రావ‌డం లేద‌ని, షూటింగ్‌ను జ‌ర‌ప‌డం లేద‌ని స‌మాచారం. శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ మూవీ రిలీజ్ కావ‌డం అనుమాన‌మేన‌ట‌.

ధ‌నుష్ సినిమా మాత్ర‌మే...

ప్ర‌స్తుతం శ్రీలీల చేతిలో ఒకే ఒక సినిమా ఇది. ధ‌నుష్ ఓం ఛాప్ట‌ర్ వ‌న్ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతుంది. ఈ యాక్ష‌న్ సినిమాలో సాయిప‌ల్ల‌వి మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది.

 

Advertisement
Advertisement