ASUS Vivobook 15 | రెండు కొత్త ఏఐ ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసిన ఆసుస్.. ఫీచర్లు అదిరిపోయాయి.. ధర తక్కువే..
ASUS Vivobook 15 | కంప్యూటర్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఆసుస్ భారత్‌లో తన నూతన ల్యాప్‌టాప్ మోడల్స్‌ను లాంచ్ చేసింది. వివోబుక్ 15, టఫ్ గేమింగ్ ఎ15 పేరిట ఈ ఏడాదికి గాను నూతన వేరియెంట్లను విడుదల చేసింది. ఈ మోడల్స్ భారత మార్కెట్లో శుక్రవారం విడుదలయ్యాయి. వీటిల్లో ఇంటెల్ కోర్ 5 సిరీస్ 3 ప్రాసెసర్ వేరియెంట్లను ఇచ్చారు.
Technology | Published On Jul 3, 2026, 3.50 pm IST
ASUS Vivobook 15 | కంప్యూటర్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఆసుస్ భారత్‌లో తన నూతన ల్యాప్‌టాప్ మోడల్స్‌ను లాంచ్ చేసింది. వివోబుక్ 15, టఫ్ గేమింగ్ ఎ15 పేరిట ఈ ఏడాదికి గాను నూతన వేరియెంట్లను విడుదల చేసింది. ఈ మోడల్స్ భారత మార్కెట్లో శుక్రవారం విడుదలయ్యాయి. వీటిల్లో ఇంటెల్ కోర్ 5 సిరీస్ 3 ప్రాసెసర్ వేరియెంట్లను ఇచ్చారు. ఈ సిరీస్‌తో వచ్చిన దేశంలోని తొలి ల్యాప్‌టాప్‌గా ఆసుస్ వివో బుక్15 (2026) నిలిచింది. అలాగే టఫ్ గేమింగ్ ఎ15ను అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ప్రత్యేకంగా లాంచ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. వివోబుక్ 15 మోడల్‌లో ఇంటెల్ కోర్ 5 సిరీస్ 3 ప్రాసెసర్ వేరియెంట్లను ఇచ్చారు. ఇవి విండోస్ ఏఐ ఫీచర్ల కోసం గరిష్టంగా 16 టాప్స్ కెపాసిటీతో పనిచేస్తాయి. అలాగే ఇంటెల్ ఏఐ బూస్ట్ ఎన్‌పీయూను ఇచ్చారు. దీని వల్ల ఏఐ పనులను ఈ ల్యాప్‌టాప్‌లో చాలా వేగంగా నిర్వహించుకోవచ్చు. ఇందులో 15.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ కలిగిన యాంటీ గ్లేర్ డిస్‌ప్లేను ఇచ్చారు.
వివోబుక్ 15 ల్యాప్‌టాప్‌లో..
వివోబుక్ 15 ల్యాప్‌టాప్‌లో 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్, వైఫై 6 వంటి ఫీచర్లను ఇచ్చారు. కేవలం 1.7 కిలోల బరువు మాత్రమే కలిగి ఉంటుంది కనుక ప్రయాణాల్లో సులభంగా తీసుకెళ్లవచ్చు. ఈజీగా వాడుకోవచ్చు. దీంట్లో బ్యాక్‌లిట్ కీబోర్డును ఇచ్చారు. అలాగే ప్రత్యేకంగా ఏఐ కోసం కో పైలట్ కీ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్‌తో లాగిన్ అవ్వచ్చు. హెచ్‌డీ వెబ్‌క్యామ్‌తోపాటు ప్రైవసీ షటర్ కూడా ఉంది. ఈ ల్యాప్ టాప్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉన్నందున బిల్డ్ క్వాలిటీ చాలా దృఢంగా ఉంటుంది. కూల్ సిల్వర్, క్వయెట్ బ్లూ, టెర్రా కాట్టా కలర్ ఆప్షన్‌లలో ఈ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేశారు. ఇందులో ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ గ్రాఫిక్స్ ఇచ్చారు. ఏడాదిపాటు 100జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. డిస్‌ప్లేకు 60 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 250 నిట్స్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లను అందించారు. విండోస్ 11 హోమ్ ఓఎస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ 2024, ఏడాది పాటు మైక్రోసాఫ్ట్ 365 బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌లను దీంతో ఇస్తున్నారు. అలాగే బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్ ఎ, టైప్ సి, హెచ్‌డీఎంఐ పోర్టులు, 3.5ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ సదుపాయాలను అందించారు. ఇందులో 42 వాట్ అవర్ బ్యాటరీ ఉండగా, దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. అందువల్ల ల్యాప్‌టాప్ 49 నిమిషాల్లో సుమారుగా 60 శాతం వరకు చార్జింగ్ అవుతుందని కంపెనీ తెలిపింది.
టఫ్ గేమింగ్ ఎ15 ల్యాప్ టాప్‌లో..
టఫ్ గేమింగ్ ఎ15 ల్యాప్ టాప్‌లో ఏఎండీ రైజెన్ 7 8845హెచ్‌ఎస్ ప్రాసెసర్‌తోపాటు ఎన్విడియా జీఫోర్స్ ఆర్‌టీఎక్స్ 3050 4జీబీ గ్రాఫిక్స్ కార్డ్‌ను అందించారు. ఇందులో 16జీబీ ర్యామ్, 512జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్, 15.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ 144 హెడ్జ్ డిస్‌ప్లే ఉన్నాయి. ఈ మోడల్ గ్రాఫైట్ బ్లాక్ రంగులో లాంచ్ అయింది. ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌లో 8 కోర్లు, 16 థ్రెడ్‌లతో గరిష్టంగా 5.1 గిగాహెడ్జ్ స్పీడ్ అందించే ఏఎండీ రైజెన్ 7 8845హెచ్‌ఎస్ ప్రాసెసర్ ఉంది. ఏఎండీ ఎక్స్‌డీఎన్‌ఏ ఎన్‌పీయూ ద్వారా 16 టాప్స్ వరకు ఏఐ పనితీరు లభిస్తుంది. ఎన్విడియా జీఫోర్స్ ఆర్‌టీఎక్స్ 3050 4జీబీ జీడీడీఆర్6 జీపీయూ డైనమిక్ బూస్ట్‌తో గరిష్టంగా 75వాట్ పవర్‌ను అందిస్తుంది. ర్యామ్‌ను 64జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, అడాప్టివ్ సింక్ సపోర్ట్ కలిగిన డిస్‌ప్లేతోపాటు, 2.0 సెల్ఫ్ క్లీనింగ్ కూలింగ్ సిస్టమ్, డ్యూయల్ ఫ్యాన్లు, ఆర్‌జీబీ బ్యాక్‌లిట్ కీబోర్డ్, ఆర్‌జే45 లాన్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. విండోస్ 11 హోమ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ 2024, ఒక సంవత్సరం పాటు మైక్రోసాఫ్ట్ 365 బేసిక్, రెండు నెలల ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లను కూడా అందిస్తున్నారు. ఇందులో 48 వాట్ అవర్ బ్యాటరీ ఉంది.
ధర వివరాలు..
భారత్‌లో ఆసుస్ వివోబుక్ 15 ప్రారంభ ధరను రూ.1,07,990గా నిర్ణయించారు. ఇది అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లలో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. ఇక టఫ్ గేమింగ్ ఎ15 ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ.1,24,990గా ఉంది. ఇది అమెజాన్‌లో ప్రైమ్ డే స్పెషల్‌గా మాత్రమే లభిస్తుంది. ప్రారంభ ఆఫర్లలో బ్యాంక్ డిస్కౌంట్లు, ఈజీ పే ఆప్షన్లు, గరిష్టంగా 9 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాలను కూడా అందిస్తున్నారు.
తాజావార్తలు
- ●Thalapathy Vijay | దళపతి విజయ్ వర్సెస్ జాసన్ సంజయ్ - తండ్రీకొడుకుల బాక్సాఫీస్ ఫైట్
- ●Telangana Agriculture | తెలంగాణలో 10.20 లక్షల ఎకరాలకు తగ్గిన సాగు.. మరి వరి సాగు ఎంతో తెలుసా..?
- ●Vinod Kumar | పిచ్చి పిచ్చి సవాళ్లెందుకు.. ఫస్ట్ మేడిగడ్డకు బయల్దేరండి
- ●IND vs ENG 2nd T20 | నేడు భారత్-ఇంగ్లండ్ రెండో టీ20.. మళ్లీ వానగండం తప్పదా.?
- ●Aadhaar | ఇక ఆధార్‌లో ఈ-మెయిల్ అప్డేట్ ఇంటి నుంచే.. యూఐడీఏఐ కొత్త సౌకర్యం..
- ●Arvind Kejriwal | ప్రధానికి తెలియకుండా ఇది అసాధ్యం.. రామాలయ విరాళాల దుర్వినియోగంపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

Thalapathy Vijay | దళపతి విజయ్ వర్సెస్ జాసన్ సంజయ్ - తండ్రీకొడుకుల బాక్సాఫీస్ ఫైట్

Telangana Agriculture | తెలంగాణలో 10.20 లక్షల ఎకరాలకు తగ్గిన సాగు.. మరి వరి సాగు ఎంతో తెలుసా..?

Vinod Kumar | పిచ్చి పిచ్చి సవాళ్లెందుకు.. ఫస్ట్ మేడిగడ్డకు బయల్దేరండి

IND vs ENG 2nd T20 | నేడు భారత్-ఇంగ్లండ్ రెండో టీ20.. మళ్లీ వానగండం తప్పదా.?



