త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NCP | ఎన్సీపీ విలీనంపై ఎలాంటి చ‌ర్చా జ‌ర‌గ‌లేదు : మ‌హారాష్ట్ర మంత్రి

NCP | ఎన్సీపీ (Nationalist Congress Party) విలీనం అంశం మ‌హా రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాజా భేటీలో పార్టీ విలీనానికి సంబంధించి ఎలాంటి రాజ‌కీయ చ‌ర్చ‌లూ జ‌ర‌గ‌లేద‌ని మ‌హారాష్ట్ర మంత్రి దత్తాత్రేయ్ భ‌ర్ణే (Dattatray Bharne) స్ప‌ష్ట‌త‌నిచ్చారు.

D

National | Published On Nov 13, 2026, 5.22 pm IST

NCP | ఎన్సీపీ విలీనంపై ఎలాంటి చ‌ర్చా జ‌ర‌గ‌లేదు : మ‌హారాష్ట్ర మంత్రి
Advertisement

NCP | ఎన్సీపీ (Nationalist Congress Party) విలీనం అంశం మ‌హా రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 2023లో రెండు వ‌ర్గాలుగా విడిపోయిన ఎన్సీపీ ఇప్పుడు మ‌ళ్లీ విలీనం కాబోతోందంటూ గ‌త కొంత‌కాలంగా చ‌ర్చ జ‌రుగుతోంది. సునేత్ర ప‌వార్ వ‌ర్గానికి చెందిన ప్రఫుల్ పటేల్, పార్థ్ పవార్‌తో సహా పలువురు ప్రముఖ నాయకులు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలవడంతో ఈ విలీన చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ ప్ర‌చారం వేళ ఉప ముఖ్య‌మంత్రి సునేత్ర ప‌వార్ (Sunetra Pawar ) నివాసంలో జ‌రిగిన ఎమ్మెల్యేల భేటీతో విలీనం అంశం మ‌రోసారి రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అయితే, తాజా భేటీలో పార్టీ విలీనానికి సంబంధించి ఎలాంటి రాజ‌కీయ చ‌ర్చ‌లూ జ‌ర‌గ‌లేద‌ని మ‌హారాష్ట్ర మంత్రి దత్తాత్రేయ్ భ‌ర్ణే (Dattatray Bharne) స్ప‌ష్ట‌త‌నిచ్చారు. పూణెలోని ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్ నివాసంలో జరిగిన ఎమ్మెల్యేల భేటీ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. "విలీనంపై ఎలాంటి చ‌ర్చా జరగలేదు. ఇది పార్టీ అధికారికంగా ఏర్పాటు చేసిన సమావేశం కాదు. దీపావ‌ళి త‌ర్వాత‌ సునేత్ర పవార్ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి, అలాగే రాష్ట్రంలోని కరువు పరిస్థితులు, నియోజకవర్గాల అభివృద్ధి నిధులపై చర్చించడానికి తామంతా ఉప‌ముఖ్య‌మంత్రిని మర్యాదపూర్వకంగా క‌లిసి చ‌ర్చించాము" అని ఆయ‌న వెల్ల‌డించారు. కాగా, రెండు రోజుల క్రితం బారామ‌తిలో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో విలీనంపై సునేత్ర ప‌వార్‌ను మీడియా ప్ర‌శ్నించ‌గా.. త‌గిన స‌మ‌యంలో అన్నీ తెలుస్తాయంటూ మాట‌దాట‌వేశారు. దీంతో విలీనం ఊహాగానాల‌కు మ‌రింత బ‌లం చేకూరింది.

Also Read..

ఐఐటీ రూర్కీలో విషాదం.. విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి

ఖేల్‌రత్నకు బ్రేక్‌.. 17 మంది అర్జున అవార్డులు

మోక్ష‌జ్ఞ కంటే ముందే - సినిమాల్లోకి బాల‌కృష్ణ కూతురు

Advertisement
Advertisement