త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IIT Roorkee | ఐఐటీ రూర్కీలో విషాదం.. విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి

IIT Roorkee | ఐఐటీ రూర్కీ (IIT Roorkee)లో గణిత విభాగంలో బీఎస్-ఎంఎస్ (BS-MS in Mathematics and Computing) రెండో సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల ఆయుష్ రజోరియా (Ayush Rajoria) అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందాడు.

D

National | Published On Nov 13, 2026, 3.58 pm IST

IIT Roorkee | ఐఐటీ రూర్కీలో విషాదం.. విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి
Advertisement

IIT Roorkee | త్రినేత్ర న్యూస్ : దేశంలోని ప్ర‌తిష్ఠాత్మ‌క విద్యా సంస్థ ఐఐటీ రూర్కీ (IIT Roorkee)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్యాంపస్‌లోని హాస్టల్ గదిలో 20 ఏళ్ల విద్యార్థి అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెంద‌డం (student allegedly dies) క‌ల‌క‌లం రేపింది. మృతుడు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఆయుష్ రజోరియాగా (Ayush Rajoria) గుర్తించారు.

రజోరియా గణిత విభాగంలో బీఎస్-ఎంఎస్ (BS-MS in Mathematics and Computing) రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం సాయంత్రం అత‌డు త‌న హాస్ట‌ల్ గ‌దిలో విగ‌త‌జీవిగా ప‌డి ఉండ‌టాన్ని తోటి విద్యార్థులు గుర్తించారు. వెంట‌నే యాజ‌మాన్యానికి స‌మాచారం అందించారు. సిబ్బంది స‌ద‌రు విద్యార్థిని హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు క్యాంప‌స్‌లోకి వెళ్లి హాస్ట‌ల్ గ‌దిని ప‌రిశీలించారు. గ‌దిలో ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ర‌జోరియా ఆత్మ‌హ‌త్య (suicide) చేసుకున్న‌ట్లు భావిస్తున్నారు. ఈ మేర‌కు ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై విశ్వ‌విద్యాల‌యం ఒక అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని తెలిపింది. విద్యార్థి కుటుంబానికి అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చింది.

Also Read..

బెంగ‌ళూరు మెట్రో పింక్‌లైన్ ప్రారంభం.. సీఎం డీకేతో ప్ర‌ధాని మెట్రో రైడ్‌

ఏబీఎన్ నూతన కార్యాలయాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

మా బాస్ మాకు కావ‌ల్సిందే.. జెన్స‌న్ హువాంగ్‌కు మ‌ద్ద‌తుగా ఉద్యోగుల ర్యాలీ..

Advertisement
Advertisement