త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supriya Sule | ఆ బిల్లుపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు : సుప్రియా సూలే

Supriya Sule | కేంద్రం ప్ర‌తిపాదించిన డీలిమిటేష‌న్ బిల్లు (Delimitation Bill)కు నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) మ‌ద్ద‌తు ఇస్తుందంటూ వ‌స్తున్న వార్త‌ల‌ను ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే (Supriya Sule) తోసిపుచ్చారు.

D

National | Published On Jul 15, 2026, 4.49 pm IST

Supriya Sule | ఆ బిల్లుపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు : సుప్రియా సూలే
Advertisement

Supriya Sule | కేంద్రం ప్ర‌తిపాదించిన డీలిమిటేష‌న్ బిల్లు (Delimitation Bill)కు నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) మ‌ద్ద‌తు ఇస్తుందంటూ వ‌స్తున్న వార్త‌ల‌ను ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే (Supriya Sule) తోసిపుచ్చారు. ఈ బిల్లుపై త‌మ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప్ర‌చారం టీక‌ప్పులో తుపాను (Storm In A Teacup) లాంటిద‌ని పేర్కొన్నారు.

ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌, సీనియ‌ర్ నాయ‌కులు జ‌యంత్ పాటిల్‌, శ‌శికాంత్ షిండేల‌తో చ‌ర్చ‌ల అనంత‌రం సూలే మీడియాతో మాట్లాడారు. ఎన్డీయేకి మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ఆమె కొట్టిపారేశారు. ప్ర‌తిపాదిత చ‌ట్టంపై త‌మ పార్టీ ఏ వార్తాప‌త్రిక‌తో గానీ, టీవీ ఛాన‌ల్‌తో గానీ మాట్లాడ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా ఇవ్వ‌లేద‌ని చెప్పారు. అంతేకాదు, ఆ బిల్లును త‌మ పార్టీ ఇంత వ‌ర‌కూ చూడ‌లేద‌ని చెప్పారు. ఆ బిల్లు త‌మ చేతికి అందాక‌.. దాన్ని ప‌రిశీలించి 24 గంట‌ల్లో స్పంద‌న తెలియ‌జేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

అది వ్య‌క్తిగ‌త సంభాష‌ణ‌..

ఓ జర్నలిస్టు, స్నేహతుడితో వాట్సాప్‌లో జ‌రిగిన వ్య‌క్తిగ‌త సంభాష‌న‌ను పార్టీ అధికారిక అభిప్రాయంగా ప్రచారం చేశార‌ని సుప్రియా సూలే తెలిపారు. “ఈ బిల్లు గురించి నాకు ఒక మీడియా వ్యక్తి నుంచి సందేశం వచ్చింది. దానికి ప్రతిస్పందనగా.. 50 శాతం పరిమితిపై చర్చకు వస్తే పరిశీలిస్తాం అని నేను చెప్పాను. ఆ జ‌ర్న‌లిస్ట్ నా స్నేహితుడు. ఇది మా ఇద్ద‌రి మ‌ధ్య‌ జరిగిన వ్యక్తిగత సంభాషణ మాత్ర‌మే. దాన్ని పార్టీ నిర్ణ‌యంగా చిత్రీక‌రించారు” అని ఆమె స్పష్టం చేశారు.

అది అవాస్త‌వం..

బీజేపీ నేతృత్వంలోని కూట‌మికి ఎన్సీపీ ద‌గ్గ‌ర‌వుతోందంటూ వ‌స్తున్న వార్త‌ల‌ను సుప్రియా సూలే ఖండించారు. త‌మ‌కు ఏ రాజ‌కీయ కూట‌మి నుంచీ ఎలాంటి ప్ర‌తిపాద‌నా రాలేద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిప‌క్ష కూట‌మిలోని మిత్ర‌ప‌క్షాల‌తో త‌మ పార్టీ సంప్ర‌దింపులు కొన‌సాగిస్తోంద‌ని చెప్పారు.

Also Read..

రెండు రోజుల్లో చ‌నిపోవ‌చ్చు.. వాంగ్‌చుక్‌ను ర‌క్షించండి.. ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖ‌లు

ఇన్‌స్టామార్ట్ ద్వారా బుక్ చేసిన 10 నిమిషాల్లోనే గ్యాస్ సిలిండ‌ర్ డెలివ‌రీ.. దేశంలోనే తొలిసారి

అమ‌ల్లోకి భారత్-యూకే వాణిజ్య ఒప్పందం.. హైదరాబాద్ నుంచి కంటైనర్లు ప్రారంభం

Advertisement
Advertisement