Romantic OTT | అర్ధరాత్రి ఇంటిపై రౌడీల ఎటాక్ – ఓటీటీలోకి ట్విస్ట్‌లతో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ
అశోక్ సెల్వన్ , ప్రీతి ముకుందన్ హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ అన్బిల్ అవన్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. నవంబర్ 20న సోనీలివ్ ఓటీటీలో ఈరొమాంటిక్ థ్రిల్లర్ మూవీ విడుదల కాబోతుంది. తమిళంతో పాటు తెలుగులో రిలీజ్ అవుతోంది.
Romantic OTT | అశోక్ సెల్వన్, ప్రీతి ముకుందన్ జంటగా నటించిన తమిళ మూవీ అన్బిల్ అవన్ విభిన్నమైన ప్రయత్నంగా ప్రేక్షకులను మెప్పించింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ భారీగా వసూళ్లను రాబట్టింది. ఆర్ కార్తికేయన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విఘ్నేష్ రాజాతో కలిసి అశోక్ సెల్వన్ స్క్రీన్‌ప్లే అందించారు. ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన అన్బిల్ అవన్ పది కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
సోనీలివ్...
ఈ కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. అన్బిల్ అవన్ మూవీ నవంబర్ 20న సోనీ లివ్ ఓటీటీలో విడుదల కాబోతుంది. తమిళం, తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ ప్లాట్‌ఫామ్ వెల్లడించింది.
హిల్ స్టేషన్....
అన్బిల్ అవన్ సినిమాలో హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు ఓ ప్రొడ్యూసర్‌గా కూడా అశోక్ సెల్వన్ వ్యవహరించారు. కాన్సెప్ట్, హీరోహీరోయిన్ల నటన, కెమిస్ట్రీ బాగున్నాయంటూ కామెంట్లు వినిపించాయి. సూర్య, ఇయాల్ హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తిచేస్తారు. కష్టపడి కొంత డబ్బు దాచుకొని హిల్ స్టేషన్‌లో హోమ్ స్టే కోసం పాతకాలం నాటి రాణి పద్మినికి చెందిన బంగ్లాను కొంటారు. అందులో అడుగుపెట్టిన తర్వాత వారికి అనూహ్య పరిణామాలు ఎదురవుతాయి? ఓ రాత్రి పూట కొందరు ఆగంతకులు వారి బంగ్లాపై ఎటాక్ చేస్తారు? వాళ్లు ఎవరు? తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ రౌడీలతో సూర్య, ఇయాల్ ఎలాంటి పోరాటం సాగించారు అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!






