Massive Fire | టెక్స్‌టైల్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
Massive Fire | సూరత్ (Surat)లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. టెక్స్‌టైల్ వ్యర్థాల గోడౌన్‌లో (textile waste warehouse) మంటలు చెలరేగాయి. రంగంలోకి దిగిన తొమ్మిది అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలి వద్ద మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
Massive Fire | త్రినేత్ర న్యూస్ : గుజరాత్ (Gujarat)లోని సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. టెక్స్‌టైల్ వ్యర్థాల గోడౌన్‌లో (textile waste warehouse) మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లోనే పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతాన్ని దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
సూరత్‌లో ఖర్వాసా (Kharvasa) కెనాల్ రోడ్డు సమీపంలోని ఏఎన్‌జీ సొసైటీ (ANG Society) దగ్గర వస్త్ర వ్యర్థాలను నిల్వ ఉంచిన ఒక గిడ్డంగిలో శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు రెండు బిఘాల విస్తీర్ణంలో ఉన్న బహిరంగ స్థలంలో వస్త్ర వ్యర్థాలను భారీగా నిల్వ చేయడంతో మంటలు క్షణాల్లోనే ఎగసిపడ్డాయి. నల్లటి పొగ ఉవ్వెత్తున ఎగసిపడింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన తొమ్మిది అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలి వద్ద మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Gujarat: A massive fire breaks out in a cloth storage godown in Kharvasa area of Surat. Fire tenders are present at the spot, and firefighting operations are underway. Cause of the fire is yet to be ascertained. https://t.co/iqcts25zF1
— ANI (@ANI) November 14, 2026
Also Read..
సీఎం డీకే Vs మాణికం ఠాగూర్.. కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిన మేకెదాటు
సంబంధిత వార్తలు

Madhya Pradesh | Massive Fire | మూడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు సజీవ దహనం
నవంబర్ 9, 2026

Naroda Murder Case | “కూర రుచిగా లేదు” అన్నందుకు ఇంత దారుణమా? కిచెన్ నైఫ్‌తో పొడిచి భర్త ప్రాణం తీసిన భార్య!
నవంబర్ 8, 2026

SD Pay App Scam | నెలకు 9% లాభమంటూ నమ్మించారు.. 6.5 లక్షల మందిని ముంచి 1200 కోట్లు కొల్లగొట్టారు!
నవంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Special Trains | రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 14 ప్రత్యేక రైళ్లలో బెర్తులు ఖాళీ..!
- ●RS Praveen Kumar | ‘తెలంగాణ రేవంత్ సైన్యమే’ కవిత పార్టీ
- ●Rahul Gandhi | టీ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కోరిక నెరవేర్చిన రాహుల్ గాంధీ
- ●Giri Babu | టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
- ●Deeksha Divas | 29న అలుగునూర్‌లో దీక్షా దివస్.. హాజరు కానున్న కేటీఆర్
- ●Romantic OTT | రాణి పద్మిని బంగ్లాలో యువ జంట అడుగుపెడితే - ఓటీటీలోకి ట్విస్ట్‌లతో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ

Special Trains | రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 14 ప్రత్యేక రైళ్లలో బెర్తులు ఖాళీ..!

RS Praveen Kumar | ‘తెలంగాణ రేవంత్ సైన్యమే’ కవిత పార్టీ

Rahul Gandhi | టీ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కోరిక నెరవేర్చిన రాహుల్ గాంధీ

Giri Babu | టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత



