త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchander Rao | రాహుల్ గాంధీకి తెలంగాణ‌లో అడుగుపెట్టే నైతిక హ‌క్కు లేదు

Ramchander Rao | అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్ప‌టికీ నెర‌వేర‌లేద‌ని, రాహుల్ గాంధీకి తెలంగాణ‌లో అడుగుపెట్టే నైతిక హ‌క్కు లేద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Nov 14, 2026, 3.49 pm IST

Ramchander Rao | రాహుల్ గాంధీకి తెలంగాణ‌లో అడుగుపెట్టే నైతిక హ‌క్కు లేదు
Advertisement

అది భార‌త్ స‌మ్మిట్ కాదు.. యాంటీ భార‌త్ స‌మ్మిట్
విదేశీ శ‌క్తుల‌తో క‌లిసి దేశంలో రెజీమ్ చేంజ్ కుట్ర ప‌న్నుతున్నారు
అక్ర‌మ హౌస్ అరెస్టుల‌పై బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు ఫైర్

Ramchander Rao | త్రినేత్ర న్యూస్ : అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్ప‌టికీ నెర‌వేర‌లేద‌ని, రాహుల్ గాంధీకి తెలంగాణ‌లో అడుగుపెట్టే నైతిక హ‌క్కు లేద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. రాహుల్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో రామ‌చంద‌ర్ రావును హౌస్ అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

రాహుల్ గాంధీ హైద‌రాబాద్‌లో భార‌త్ స‌మ్మిట్‌కు వ‌చ్చారు. ఇది పెట్టుబ‌డుల కోసం నిర్వ‌హించిన‌ స‌మ్మిట్ కాదు.. కేవ‌లం దేశంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై విదేశీయుల‌ను పిలిపిచించి మాట్లాడిస్తున్నారు. రైతుల‌ను ప‌ట్టించుకోకుండా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఈ కార్య‌క్ర‌మానికి స్పాన్స‌ర్ చేసింది. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తూ, న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం మీద ప్ర‌పంచానికి త‌ప్పుడు స‌మాచారం ఇచ్చే విధంగా ఈ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసిన‌ట్టు మ‌న‌కు స్ప‌ష్టంగా క‌న‌బడుతుంది. విదేశీయుల నుంచి వ‌చ్చిన వారిలో దేశ వైఖ‌రికి వ్య‌తిరేకంగా ఉన్నారు. నార్వే జ‌ర్న‌లిస్టు లెహంగ్ త‌న వీసా ర‌ద్దు చేసిన‌ట్టు ట్విట్ట‌ర్‌లో పెట్టుకుంది. దేశానికి వ్య‌తిరేకంగా ఐదు వ్యాసాలు రాసింది. మోదీ మీద కూడా వ్య‌తిరేకంగా వ్యాసాలు రాసింది అని రామ‌చంద‌ర్ రావు గుర్తు చేశారు.

రాహుల్ గాంధీ విదేశాల‌కు వెళ్తే.. దేశానికి వ్య‌తిరేకంగా మాట్లాడి వ‌స్తున్నారు. ఇప్పుడు ఆయ‌న విదేశాల‌కు వెళ్ల‌కుండా, విదేశీయుల‌నే ఇక్క‌డికి ఆహ్వానించి దేశానికి వ్య‌తిరేకంగా మాట్లాడిస్తున్నారు. రాజ‌కీయ అంశాల‌పై కొట్లాడుదాం.. విమ‌ర్శించుకుందాం. విదేశీ శక్తులతో కలిసి ప్రొగ్రెసివ్ అల‌య‌న్స్ దేశంలో ‘రెజీమ్ చేంజ్’ కుట్ర పన్నుతుంది. నేపాల్, బంగ్లాదేశ్‌, ఫ్రాన్స్‌లో కూడా విద్యార్థుల‌కు స్పాన్ష‌ర్లుగా ఉండి అధికార మార్పిడికి శ్రీకారం చుట్టారు. అలాంటి సంస్థ రాహుల్ గాంధీతో క‌లిసి ప‌ని చేస్తుంది. దాన్ని వ్య‌తిరేకిస్తున్నాం. పెట్టుబ‌డుల‌కు మేం వ్య‌తిరేకం కాదు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమ‌లు చేస్తామ‌ని చెప్పిపోయారు. కానీ ఉద్యోగాల్లేవు, జాబ్ క్యాలెండ‌ర్ లేదు, రైతు భ‌రోసా లేదు. ఒక వాగ్దానం కూడా పూర్తి కాలేదు. ఆయ‌నకు తెలంగాణ‌లో అడుగుపెట్టే నైతిక హ‌క్కు లేదు. రాహుల్ రాక‌ను వ్య‌తిరేకిస్తున్నాం.. అడ్డుకుంటాం అని రామ‌చంద‌ర్ రావు హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement