PM Modi | ప్రధాని మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar), ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే భేటీ అయ్యారు. బుధవారం ఉదయం ప్రధాన మంత్రి కార్యాలయంలో (PMO) జరిగిన ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
PM Modi | కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎన్సీపీ (ఎస్పీ) మద్దతు ఇవ్వనుందంటూ (NCP Support To NDA) గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారం వేళ తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar), ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఉదయం ప్రధానితో భేటీ అయ్యారు.

తన కార్యాలయానికి వచ్చిన ఎన్సీపీ చీఫ్‌ను ప్రధాని స్వయంగా లోపలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువరూ చర్చించారు. దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటికి సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీకి శరద్ పవార్ మెమోరాండం సమర్పించారు. ప్రధాన మంత్రి కార్యాలయంలో (PMO) జరిగిన ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరి భేటీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఓ వైపు కాక్రోచ్ పార్టీ నిరసనలు, మరోవైపు కాంగ్రెస్ నిరసనల మధ్య వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read..
స్టాక్ మార్కెట్ ట్రేడర్లు ఐటీఆర్‌లో వివరాలను నమోదు చేయాలా.. తెలుసుకోవాల్సిన విషయాలు..
తాజావార్తలు
- ●Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
- ●Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!
- ●Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత

Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ

Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్

Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..

Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం






