Supriya Sule | అజిత్ దాదా మరణించిన రోజే విలీన చర్చలకు ఫుల్‌స్టాప్ పడింది : సుప్రియా సూలే
Supriya Sule | ఎన్సీపీ (Nationalist Congress Party) విలీనం అంశంపై ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) తాజాగా స్పందించారు. ఈ మేరకు విలీన వార్తలు, పార్టీ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. అజిత్ దాదా (Ajit Dada) మరణించిన రోజే ఆ చర్చలు (NCP Merger Talks) ముగిసిపోయాయని తెలిపారు.
Supriya Sule | త్రినేత్ర న్యూస్ : ఎన్సీపీ (Nationalist Congress Party) విలీనం అంశం మహా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2023లో రెండు వర్గాలుగా విడిపోయిన ఎన్సీపీ ఇప్పుడు మళ్లీ విలీనం కాబోతోందంటూ గత కొంతకాలంగా చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) తాజాగా స్పందించారు. ఈ మేరకు విలీన వార్తలు, పార్టీ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. అజిత్ దాదా (Ajit Dada) మరణించిన రోజే ఆ చర్చలు (NCP Merger Talks) ముగిసిపోయాయని తెలిపారు.
"బారామతిలో మీడియాతో సుప్రియా సూలే మాట్లాడుతూ.. రెండుగా విడిపోయిన ఎన్సీపీ పార్టీ విలీనంపై గతంలో చర్చలు జరిగాయి. ఈ విషయమై పలు సమావేశాలు కూడా నిర్వహించాం. అయితే, ఈ ఏడాది జనవరిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ (Ajit Pawar) ఆకస్మిక మరణం తర్వాత ఆ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దాదా కన్నుమూసిన రోజే విలీన చర్చలకు ఫుల్‌స్టాప్ పడింది" అని చెప్పారు.
విలీనంపై కూటమిని సంప్రదించాల్సిందే..
ఇదిలా ఉండగా.. రెండు వర్గాల విలీనంపై మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజబల్ మాట్లాడుతూ.. ఎన్సీపీ రెండు వర్గాలు విలీనం కావాలంటే అధికారంలోని బీజేపీ కూటమిని సంప్రదించాల్సిందేనని స్పష్టం చేశారు. ఏ నిర్ణయమైనా పార్టీ నాయకత్వం, మిత్రపక్షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే సాధ్యమవుతుందని అన్నారు. "మేము (ఎన్సీపీ) వారితో (బీజేపీ) కలిసి ప్రభుత్వంలో ఉన్నాము. వారిని సంప్రదించకుండా మేం ఎలాంటి అడుగు ముందుకు వేయలేము. వారి అనుమతి కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది" అని ఆయన బీజేపీ నేతృత్వంలోని కూటమిని ఉద్దేశించి అన్నారు. కూటమిలో అతిపెద్ద భాగస్వామి అయిన బీజేపీని సంప్రదించకుండా విలీనం సాధ్యం కాదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఎన్సీపీ (Nationalist Congress Party) విలీనం అంశం మహా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2023లో రెండు వర్గాలుగా విడిపోయిన ఎన్సీపీ ఇప్పుడు మళ్లీ విలీనం కాబోతోందంటూ గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. సునేత్ర పవార్ వర్గానికి చెందిన ప్రఫుల్ పటేల్, పార్థ్ పవార్‌తో సహా పలువురు ప్రముఖ నాయకులు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలవడంతో ఈ విలీన చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. రెండు రోజుల క్రితం బారామతిలో జరిగిన విలేకరుల సమావేశంలో విలీనంపై సునేత్ర పవార్ (Sunetra Pawar)ను మీడియా ప్రశ్నించగా.. తగిన సమయంలో అన్నీ తెలుస్తాయంటూ మాటదాటవేశారు. దీంతో విలీనం ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే, సుప్రియా సూలే తాజా వ్యాఖ్యలతో విలీనం అంశం ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది.
Also Read..
ఎన్విడియా షేర్లు భారీగా పతనం.. వారంలోనే రూ.47 లక్షల కోట్లు ఆవిరి..
బంగారం ధర పైకి, వెండి ధర కిందకి.. బులియన్ మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు..
ఊరేగింపులో బీభత్సం సృష్టించిన ఏనుగు.. పరుగులు పెట్టిన ప్రజలు.. వీడియో
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!





