త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balakrishna Daughter | మోక్ష‌జ్ఞ కంటే ముందే – సినిమాల్లోకి బాల‌కృష్ణ కూతురు

బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ హీరోగా వ‌చ్చే ఏడాది తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. మోక్ష‌జ్ఞ కంటే ముందే బాల‌కృష్ణ ఫ్యామిలీ నుంచి ఆయ‌న చిన్న కూతురు తేజ‌స్విని టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. నిర్మాత‌గా ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేయ‌బోతుంది.

N

Entertainment | Published On Nov 13, 2026, 4.40 pm IST

Balakrishna Daughter | మోక్ష‌జ్ఞ కంటే ముందే – సినిమాల్లోకి బాల‌కృష్ణ కూతురు
Advertisement

Balakrishna Daughter | బాల‌కృష్ణ ఫ్యామిలీ నుంచి ఆయ‌న త‌న‌యుడు మోక్ష‌జ్ఞ హీరోగా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాబోతున్నాడు. బింబిసార ఫేమ్ వ‌శిష్ట మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌బోతుంది. ఇటీవ‌లే మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. మోక్ష‌జ్ఞ కంటే ముందే బాల‌కృష్ణ కుటుంబం నుంచి మ‌రొక‌రు ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్ట‌పోబోతున్నారు. బాల‌కృష్ణ చిన్న‌కూతురు తేజ‌స్విని కాన్సెప్ట్ బేస్‌డ్ సినిమాతో నిర్మాత‌గా అరంగేట్రం చేయ‌బోతుంది.

ప్ర‌యోగం...

ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ఎన్‌బీకే ఫిల్మ్స్ ప‌తాకంపై తేజ‌స్విని స్వ‌యంగా నిర్మించ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ సినిమాలో సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ సింధూర‌పువ్వు కృష్ణారెడ్డి త‌న‌యుడు అన్వేష్‌ హీరోగా న‌టించ‌బోతున్నాడు. ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు సినిమాలో చైల్డ్ యాక్ట‌ర్‌గా అన్వేష్‌ క‌నిపించాడు. ఏంజెల్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొంత గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ తేజ‌స్విని నంద‌మూరి మూవీతో హీరోగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

నిఖిల్ స్వ‌యంభూ...

ఈ సినిమాకు భువ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం నిఖిల్‌తో స్వ‌యంభూ సినిమాను నిర్మిస్తున్నారు భువ‌న్‌. కోలీవుడ్ న‌టుడు బాబీ సింహా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

వైజాగ్‌లో...

నంద‌మూరి తేజ‌స్విని , అన్వేష్ మూవీ షూటింగ్ న‌వంబ‌ర్ 23 వైజాగ్‌లో మొద‌లుకానున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో బాల‌కృష్ణ హీరోగా న‌టించిన అఖండ 2 మూవీతో పాటు అన్‌స్టాప‌బుల్ టాక్ షోకు సంబంధించిన ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాలు తేజ‌స్విని చూసుకున్నారు. ఆ అనుభ‌వంతోనే నిర్మాత‌గా మారుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

Advertisement
Advertisement