Deeksha Divas | 29న అలుగునూర్‌లో దీక్షా దివస్.. హాజరు కానున్న కేటీఆర్
Deeksha Divas | ఈ నెల 29న అలుగునూర్‌లో దీక్షా దివస్( Deeksha Divas ) నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు.
Deeksha Divas | త్రినేత్ర న్యూస్ : ఈ నెల 29న అలుగునూర్‌లో దీక్షా దివస్( Deeksha Divas ) నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణ భవన్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశమై దీక్షా దివస్‌పై చర్చించారు.
ఇక శుక్రవారం అలుగునూర్‌లో సభ నిర్వహించే ప్రాంతాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్‌తో కలిసి గంగుల క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాహనాల పారింగ్‌కు అనువైన స్థలాలను పరిశీలించారు.
దీక్షా దివస్ అలుగునూర్ చౌరస్తాలోనే ఎందుకంటే..?
2009 నవంబర్ 29న కరీంనగర్ నుండి సిద్దిపేటకు దీక్షకు బయలుదేరిన కేసీఆర్‌ను అలుగునూరు చౌరస్తా వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో డిసెంబర్ 3న హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది. సీమాంధ్ర నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో.. కేంద్రం ఆ ప్రకటనను మళ్లీ వెనక్కి తీసుకుంది. మొత్తానికి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే 2010 నుంచి ప్రతి ఏడాది బీఆర్ఎస్ పార్టీ నవంబర్ 29న దీక్షా దివస్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తోంది.
సంబంధిత వార్తలు

Bharat Summit Hyderabad Visa Row | అప్పుడు రేవంత్ టూర్.. ఇప్పుడు హైదరాబాద్ ‘భారత్ సమ్మిట్’! మళ్లీ తెరపైకి వీసా వివాదం
నవంబర్ 14, 2026

Road Accident | డివైడర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!
నవంబర్ 14, 2026

CM Revanth Reddy | రాహుల్ నాయకత్వంలో దేశాన్ని కాపాడుకుందాం
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!



