Sukanya Samriddhi Yojana | సుకన్య సమృద్ధి యోజన.. 50 శాతం నగదు ఎప్పుడు తీసుకోవచ్చంటే?
Sukanya Samriddhi Yojana | ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజనలో ఉన్నత విద్య కోసం ఖాతాలోని నిల్వలో 50 శాతం వరకు నగదు ఉపసంహరించుకునే అవకాశం ఉంది.
Sukanya Samriddhi Yojana | ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజనలో ఉన్నత విద్య కోసం ఖాతాలోని నిల్వలో 50 శాతం వరకు నగదు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అయితే బాలికకు 18 ఏళ్లు నిండినా లేదా పదో తరగతి ఉత్తీర్ణత సాధించినా, ఈ రెండింటిలో ఏది ముందుగా జరిగితే అప్పటి నుంచి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఉపసంహరణ మొత్తం వాస్తవ విద్యా ఖర్చులకు మాత్రమే పరిమితమవుతుంది.
ఖాతా తెరిచేందుకు ఉన్న నియమాలు ఏమిటి..?
ఆడపిల్లల చదువు, వివాహం వంటి భవిష్యత్తు అవసరాల కోసం తల్లిదండ్రులు పొదుపు చేసేందుకు సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) మంచి పెట్టుబడి పథకంగా కొనసాగుతోంది. బాలికకు పదేళ్లు నిండకముందే ఈ పథకంలో ఖాతా తెరవవచ్చు. ఒక కుటుంబంలో సాధారణంగా ఇద్దరు ఆడపిల్లల కోసం రెండు ఖాతాలు తెరిచే అవకాశం ఉంటుంది. కవలలు లేదా ముగ్గురు ఆడపిల్లలు జన్మించిన సందర్భాల్లో మినహాయింపులు వర్తిస్తాయి. కనీసం రూ.250తో ఖాతా ప్రారంభించవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.1.50 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. పోస్టాఫీసులు, అధీకృత బ్యాంకుల్లో ఖాతా తెరవవచ్చు. మొత్తం 15 ఏళ్ల పాటు డిపాజిట్లు చేయాల్సి ఉండగా, ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 21 ఏళ్లకు మెచ్యూరిటీ వస్తుంది. ప్రస్తుతం ఈ పథకంపై ఏడాదికి 8.2 శాతం వడ్డీ లభిస్తుండడంతోపాటు పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ పథకం కేంద్ర ప్రభుత్వ బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా అమలవుతోంది.
పాక్షిక నగదు ఉపసంహరణ నిబంధనలు..
బాలిక ఉన్నత విద్య కోసం ఖాతాలోని నగదులో 50 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. అయితే గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఖాతాలో ఉన్న నిల్వ ఆధారంగానే ఈ పరిమితిని నిర్ణయిస్తారు. ఇందుకోసం ఫామ్-3తోపాటు విద్యాసంస్థలో ప్రవేశం పొందినట్లు ఆధారం లేదా ఫీజు చెల్లింపు రశీదును సమర్పించాలి. ఈ నగదును ఒకేసారి తీసుకోవచ్చు లేదా విడతల వారీగా పొందవచ్చు. విడతల పద్ధతిలో గరిష్ఠంగా ఐదేళ్లపాటు సంవత్సరానికి ఒక విడత మాత్రమే ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. అయితే వాస్తవ విద్యా ఖర్చులకు మించి నగదు తీసుకోవడానికి అనుమతి ఉండదు. అంటే ఖాతాలో 50 శాతం ఉపసంహరణకు అవకాశం ఉన్నప్పటికీ, విద్య కోసం అవసరమైన మొత్తానికే ఈ సదుపాయం పరిమితమవుతుంది.
మిగిలిన నగదు ఏమవుతుంది?
పాక్షిక ఉపసంహరణ తర్వాత ఖాతాలో మిగిలిన మొత్తంపై పథకం నిబంధనల ప్రకారం వడ్డీ కొనసాగుతుంది. ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 21 ఏళ్లు పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ మొత్తం, అప్పటివరకు వచ్చిన వడ్డీతో సహా ఖాతాదారురాలికి చెల్లిస్తారు. అలాగే బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం జరిగితే ముందుగానే ఖాతాను మూసివేసే అవకాశం ఉంటుంది. ఇందుకోసం వయస్సు ధ్రువీకరణ పత్రం, సంతకం చేసిన డిక్లరేషన్ సమర్పించాలి. ఖాతా మెచ్యూరిటీ లేదా ముందస్తు ముగింపు సమయంలో అప్పటివరకు జమ అయిన నగదు, దానిపై వచ్చిన వడ్డీని ఖాతాదారురాలికి చెల్లిస్తారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sukanya Samriddhi Yojana | కేవలం వడ్డీ ద్వారానే రూ.50 లక్షలు పొందవచ్చు.. పోస్టాఫీస్‌లో అద్భుతమైన పథకం..
జులై 27, 2026

Investment | పిల్లల భవిష్యత్తుకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది? ఏయే మార్గాలు ఉన్నాయి..?
జూన్ 16, 2026

Sukanya Samriddhi Yojana | రూ.71 లక్షల ఫండ్.. సుకన్య సమృద్ధి యోజనతో కుమార్తె భవిష్యత్తు భద్రం..
మే 30, 2026
తాజావార్తలు
- ●DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం
- ●Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!
- ●Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం
- ●Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!
- ●Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్
- ●Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!

DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం

Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!

Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం

Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!



