Boat Capsizes | అండమాన్ సముద్రంలో పడవ బోల్తా.. 250 మంది గల్లంతు
Boat Capsizes | అండమాన్ సముద్రంలో (Andaman Sea) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోహింగ్యా శరణార్థులతో (Rohingya refugees) వెళ్తున్న పడవ బోల్తా పడింది (Boat Capsizes).
Boat Capsizes | అండమాన్ సముద్రంలో (Andaman Sea) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోహింగ్యా శరణార్థులతో (Rohingya refugees) వెళ్తున్న పడవ బోల్తా పడింది (Boat Capsizes). ఈ ఘటనలో 250 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ (UNHCR), అంతర్జాతీయ వలస సంస్థ (IOM) ఈ మేరకు ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి.
బంగ్లాదేశ్‌లోని (Bangladesh) టెక్నాఫ్ ప్రాంతం నుంచి 250 మంది శరణార్థులతో బయల్దేరిన పడవ మలేషియా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రంలో బలమైన ఈదురుగాలులు, అలల ఉధృతికి బోల్తా పడినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థలు తెలిపాయి. అంతేకాదు, ప్రమాద సమయంలో పడవలో పరిమితికి మంచి ప్రయాణికులు ఉండటం కూడా ప్రమాదానికి కారణమని పేర్కొంది. ప్రమాద సమాచారం తెలియగానే అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం సముద్రంలో తీవ్రంగా గాలిస్తున్నారు.
రోహింగ్యాలు మలేషియాకు చెందిన వారే. కాకపోతే అక్కడి సైన్యం మారణహోమం నుంచి తప్పించుకునేందుకు 2017లో లక్షలాది మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు వలసవెళ్లిపోయారు. దీంతో బంగ్లాదేశ్‌లో శరణార్థి శిబిరాలు కిక్కిరిసిపోయాయి. ఇటీవలే అక్కడి పరిస్థితిలు కూడా అనుకూలంగా లేకపోవడంతో వారు మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్ వంటి పొరుగు దేశాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఇలా ప్రమాదకరంగా సముద్ర ప్రయాణం చేస్తూ ప్రమాదాలబారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
Also Read..
పంజాబ్ రాజ్యసభ సభ్యుడి అశోక్ మిట్టల్ ఇంట్లో ఈడీ సోదాలు..!
భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. అమెరికా-ఇరాన్ చర్చలపైనే ఆశలు..
పెరుగుతున్న క్రూడాయిల్ ధరలతో.. భారీ నష్టాల్లో ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు..!
తాజావార్తలు
- ●Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..
- ●Mallikarjun Kharge | ప్రధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మగా మారారు.. సర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖర్గే
- ●Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత వార్నింగ్
- ●Stocks | భారత్‌లోనే కాదు, విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
- ●POCSO Case | బాలుడిపై లైంగిక దాడి.. పోక్సో కేసులో టీచర్‌కు యావజ్జీవ శిక్ష
- ●Hyderabad | ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరు టీనేజర్లు అరెస్ట్.. 8 స్కూటర్లు స్వాధీనం

Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..

Mallikarjun Kharge | ప్రధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మగా మారారు.. సర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖర్గే

Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత వార్నింగ్

Stocks | భారత్‌లోనే కాదు, విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..






