Samrat Choudhary | బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణం.. ఆ పదవి చేపట్టిన తొలి నేతగా రికార్డు
Samrat Choudhary | బీహార్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రి (Bihar CM)గా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి (Samrat Choudhary) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.
Samrat Choudhary | బీహార్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రి (Bihar CM)గా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి (Samrat Choudhary) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రికార్డు స్థాయిలో బీహార్ రాష్ట్రాన్ని పాలించిన నితీశ్ కుమార్ (Nitish Kumar) తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నితీశ్ ఎగువ సభకు వెళ్తున్న నేపథ్యంలో తన పదవికి రిజైన్ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి నూతన సీఎంను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా సామ్రాట్ చౌదరి ఓ రికార్డు నెలకొల్పారు. బీజేపీ (BJP) నుంచి బీహార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి నేతగా నిలిచారు. ఇప్పటి వరకూ బీహార్ రాష్ట్రాన్ని జేడీయూ, ఆర్జేడీ నేతలే పాలించారు.
ఏప్రిల్ 10వ తేదీన రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ ( Nitish Kumar) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. పెద్దల సభకు ఎన్నికైన నేపథ్యంలో సీఎం పదవికి ఆయన నిన్న రాజీనామా చేశారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆ వెంటనే బీజేపీ శాసనసభాపక్ష నేతగా సామ్రాట్ చౌదరి ఎన్నికయ్యారు. దీంతో ఆయన ఇవాళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూనత సీఎంకు గవర్నర్, ఇతర అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read..
అండమాన్ సముద్రంలో పడవ బోల్తా.. 250 మంది గల్లంతు
ఏఐ మరింత మెరుగ్గా.. భారత యూజర్లకు గూగుల్ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్..
పంజాబ్ రాజ్యసభ సభ్యుడి అశోక్ మిట్టల్ ఇంట్లో ఈడీ సోదాలు..!
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ
- ●Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు
- ●Harish Rao | సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు చేద్దాం
- ●Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి
- ●Mahesh Kumar Goud | తెలంగాణకు బీసీయే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడు
- ●Delhi AAP Protest | ఢిల్లీలో ఆప్ రణరంగం: సీఈసీకి వ్యతిరేకంగా భగ్గుమన్న కార్యకర్తలు

Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ

Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు

Harish Rao | సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు చేద్దాం

Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి






