Dhurandhar | బాహుబలి, పుష్పని వెనక్కి నెట్టి.. రూ.3వేలకోట్లకుపైగా కలెక్షన్స్‌తో రికార్డును సృష్టించిన ధురంధర్..!
Dhurandhar | బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీ భారత సినీ పరిశ్రమలో అరుదైన రికార్డును నెలకొల్పింది. రెండు భాగాలుగా విడుదలైన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.3వేలకోట్లకుపైగా వసూళ్లు సాధించిన తొలి భారతీయ ఫ్రాంచైజీగా నిలిచి చరిత్ర సృష్టించింది.
Entertainment | Published On Apr 15, 2026, 11.35 am IST
Dhurandhar | బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీ భారత సినీ పరిశ్రమలో అరుదైన రికార్డును నెలకొల్పింది. రెండు భాగాలుగా విడుదలైన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.3వేలకోట్లకుపైగా వసూళ్లు సాధించిన తొలి భారతీయ ఫ్రాంచైజీగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’, అలాగే అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ఫ్రాంచైజీల రికార్డులను వెనక్కి నెట్టింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. ధురంధర్ సిరీస్‌లోని తొలిభాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,307.35 కోట్లపైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇటీవల విడుదలై నెల రోజులు పూర్తి చేసుకుంటున్న ‘ధురంధర్: ది రివెంజ్’ ఇప్పటికే రూ.1,712 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. దీంతో మొత్తం రెండు చిత్రాల కలిపిన వసూళ్లు రూ. 3,019.35 కోట్లకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘బాహుబలి’ సిరీస్ రూ. 2,438 కోట్లు, ‘పుష్ప’ ఫ్రాంచైజీ రూ. 2,092.20 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ప్రస్తుతం స్క్రీనింగ్ కొనసాగుతున్న ‘ధురంధర్: ది రివెంజ్’ ఒక్కటే 27 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 1,727.93 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఇందులో భారత్‌లోనే రూ. 1,311.68 కోట్లు రాగా, విదేశీ మార్కెట్ల నుంచి రూ.416.25 కోట్లు వచ్చాయి. విడుదలైన తొలి 11 రోజుల్లోనే మొదటి భాగం జీవితకాల వసూళ్లను అధిగమించడం ఈ మూవీ ప్రత్యేకతగా ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ అద్భుత విజయంపై ప్రముఖ ట్రేడ్ విశ్లేషణ సంస్థ సాక్‌నిల్క్ స్పందిస్తూ.. ఇది కేవలం కలెక్షన్ రికార్డు మాత్రమే కాదని పేర్కొంది. భారతీయ ఫ్రాంచైజీలను ప్రపంచ స్థాయిలో ఎలా చూడాలన్న దృక్పథంలో వచ్చిన పెద్ద మార్పుకు ఇది సంకేతమని వ్యాఖ్యానించింది. ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాలు వచ్చినప్పటికీ, గ్లోబల్ స్థాయిలో పెద్ద ఫ్రాంచైజీలతో పోటీపడే శక్తి భారతీయ కథల్లో ఉందని ‘ధురంధర్’ నిరూపించిందని తెలిపింది. మరో విశేషం ఏంటంటే.. గల్ఫ్ దేశాలు, చైనా మార్కెట్లలో విడుదల కాకుండానే ఈ స్థాయి వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘ధురంధర్ 2’ నిలిచింది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్
- ●Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు
- ●NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..
- ●గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!
- ●Horoscope | ఆగస్టు 13 రాశిఫలాలు.. ఈ రాశి వారు ధన సంపాదనకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు!
- ●Senior Citizen Property Rights India | ఆస్తి తీసుకుని పేరెంట్స్‌ను గాలికి వదిలేసిన కొడుకు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్

Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు

NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..

గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!






