Farmers Protest | రైతుల నిరసనకు తలొగ్గిన ప్రభుత్వం.. ఆ పంట సేకరణ పరిమితిని 25% నుంచి 60%కి పెంపు
Farmers Protest | పప్పు ధాన్యాలకు సంబంధించిన పంటలను 100 శాతం కొనుగోలు చేయాలని, కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన నిరసనలకు (Farmers Protest) మధ్యప్రదేశ్ ప్రభుత్వం దిగివచ్చింది. పెసరపప్పు సేకరణ పరిమితిని మొత్తం పంటలో 25 శాతం నుంచి 60 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Farmers Protest | త్రినేత్ర.న్యూస్ : పప్పు ధాన్యాలకు సంబంధించిన పంటలను 100 శాతం కొనుగోలు చేయాలని, కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన నిరసనలకు (Farmers Protest) మధ్యప్రదేశ్ ప్రభుత్వం దిగివచ్చింది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి సేకరించే పెసరపప్పు సేకరణ పరిమితిని మొత్తం పంటలో 25 శాతం నుంచి 60 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఐదల్ సింగ్ కన్సానా, రైతు ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది. నర్మదాపురం, సెహోర్, హర్దా వంటి జిల్లాల్లో ఎకరానికి సుమారు మూడు క్వింటాళ్ల పెసరపప్పు పండించే రైతులకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. అంతేకాదు, కొనుగోళ్ల గడువును పొడిగించేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వం సేకరణకు చివరి తేదీని ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20కి, స్లాట్ బుకింగ్ గడువును జులై 30 నుంచి ఆగస్టు 10కి పొడిగించింది.
అదేవిధంగా ఎరువుల పంపిణీలో అమల్లో ఉన్న ఈ-టోకెన్ వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇ-టోకెన్ విధానంపై వస్తున్న ఫిర్యాదులు, ఆచరణాత్మక ఇబ్బందులను పరిశీలించి, మెరుగుదలలను సిఫార్సు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. కమిటీ తన సిఫార్సులను సమర్పించి, అవసరమైన మార్పులు చేసే వరకు ఇ-టోకెన్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థను తక్షణమే నిలిపివేస్తున్నట్లు మంత్రి ఐదల్ సింగ్ వెల్లడించారు.
కాగా, పప్పు ధాన్యాలకు సంబంధించిన పంటలను 100 శాతం కొనుగోలు చేయాలని, కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు గత నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కర్షకులు నిన్న భోపాల్‌లో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. సుమారు 2 వేల మంది రైతులు బారికేడ్లను బద్దలు కొట్టి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (CM Mohan Yadav) నివాసంవైపు దూసుకెళ్లారు. అంతకు ముందు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసం ముందు రైతులు భారీ నిరసన చేపట్టారు. ఈ నిరసనలతో దిగొచ్చిన ప్రభుత్వం రైతుల డిమాండ్ల పరిష్కారానికి అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, 100% సేకరణ చేయాలనే తమ డిమాండ్‌కు కట్టుబడి ఉన్నామని రైతులు స్పష్టం చేశారు.
Also Read..
మీరే తినే పానీపూరీలు, సమోసాలు ఎలా ఉన్నాయో తెలుసా..?
స్టాక్ మార్కెట్‌లలో ఆటో షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mallikarjun Kharge | పేపర్ లీక్ బిల్లు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు : ఖర్గే
- ●KYC Scam | కేవైసీ పేరుతో మెసేజ్ వచ్చిందా? క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ అవుతుంది జాగ్రత్త..!
- ●Apples DCM truck overturns | ఆపిల్ పండ్ల డీసీఎం బోల్తా.. నిమిషాల్లోనే లోడు పండ్లు లూటీ.. సోషల్ మీడియాలో వైరల్
- ●Cyber Scam | బాలీవుడ్ నటికి షాకిచ్చిన సైబర్ కేటుగాళ్లు - ఓటీపీ, పిన్ లేకుండా లక్షలు దోచేశారు
- ●Jagadish Reddy | నీలాంటి క్రిమినల్‌ను ఎన్నుకోవడమే.. ఒక క్రిమినల్ వేస్ట్ రేవంతూ..! : జగదీశ్ రెడ్డి
- ●Vande Mataram Bill | వందేమాతరం బిల్లుకు పార్లమెంట్ ఓకే

Mallikarjun Kharge | పేపర్ లీక్ బిల్లు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు : ఖర్గే

KYC Scam | కేవైసీ పేరుతో మెసేజ్ వచ్చిందా? క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ అవుతుంది జాగ్రత్త..!

Apples DCM truck overturns | ఆపిల్ పండ్ల డీసీఎం బోల్తా.. నిమిషాల్లోనే లోడు పండ్లు లూటీ.. సోషల్ మీడియాలో వైరల్

Cyber Scam | బాలీవుడ్ నటికి షాకిచ్చిన సైబర్ కేటుగాళ్లు - ఓటీపీ, పిన్ లేకుండా లక్షలు దోచేశారు






