H FAST | మీరే తినే పానీపూరీలు, సమోసాలు ఎలా ఉన్నాయో తెలుసా..?
H FAST | పానీపూరీ అంటేనే లొట్టలేసుకుంటూ తింటారు.. సమోసాలను కూడా ఆ మాదిరిగానే ఆరగించేస్తారు. కానీ మీరు టైమ్‌పాస్‌కు తినే ఈ పానీపూరీ, సమోసాల తయారీ విషయంలో ఏ మాత్రం ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు.
H FAST | త్రినేత్ర.న్యూస్ : పానీపూరీ అంటేనే లొట్టలేసుకుంటూ తింటారు.. సమోసాలను కూడా ఆ మాదిరిగానే ఆరగించేస్తారు. కానీ మీరు టైమ్‌పాస్‌కు తినే ఈ పానీపూరీ, సమోసాల తయారీ విషయంలో ఏ మాత్రం ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. అపరిశుభ్ర వాతావరణంలో వాటిని తయారు చేస్తూ ఆహార ప్రియుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ నగరంలో మరోసారి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా అక్రమంగా తయారు చేస్తున్న పానీపూరీ, సమోసా కేంద్రాలు బయటపడ్డాయి.
ఈ నెల 28న అత్తాపూర్ పరిధిలోని ఎన్ఎం గూడలో హెచ్ ఫాస్ట్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి తనిఖీలు నిర్వహించారు. ఒక పానీపూరీ, మూడు సమోసా తయారీ కేంద్రాల్లో దాడులు చేయగా, భయంకరమైన దృశ్యాలు వెలుగు చూశాయి. అయితే ఎలాంటి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(FSSAI) లైసెన్స్ లేకుండానే ఆహార పదార్థాలు తయారు చేస్తూ విక్రయాలు చేస్తున్నట్లు తేలింది.

నూనె పూర్తిగా నల్లగా మారిన తర్వాత కూడా అదే నూనెను మళ్లీ మళ్లీ వినియోగించి పానీపూరీలు, సమోసాలు తయారు చేస్తున్నట్లు తేలింది. అలాగే వంటగదిలో ఈగల బెడద, తీవ్ర అపరిశుభ్రత నెలకొనడంతో పాటు ఓపెన్ డ్రైనేజీ మధ్యలోనే ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కిచెన్ పక్కనే చెత్త పేరుకుపోవడం, పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టకపోవడం వంటి తీవ్ర నిర్లక్ష్యాలు బయటపడ్డాయి. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు సుమారు 3 వేల పానీపూరీలను(15 కిలోలు) స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అదేవిధంగా 4 కిలోల సమోసాలు(10 కిలోలు), 2 కిలోల వాడిన వంటనూనెను కూడా స్వాధీనం చేసుకుని పారవేశారు. ల్యాబ్ పరీక్షల కోసం ఆహార నమూనాలను అధికారులు సేకరించారు. నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఫుడ్ బిజినెస్ కార్యకలాపాలను నిలిపివేసి, ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్‌ను అధికారులు సీజ్ చేశారు.
⚠️ Unhygienic Street Food Manufacturing Units Busted by H-FAST
Acting against unsafe food practices, H-FAST, in coordination with GHMC Food Safety officials, conducted inspections on 28.07.2026 at one Pani Puri manufacturing unit and three Samosa manufacturing units in NM Guda,… pic.twitter.com/bkAgmhlYCn
— Hyderabad Food Adulteration Surveillance Team (@HFastHCP) July 30, 2026
తాజావార్తలు
- ●Bombay High Court | రెండు పురుగులు కనిపించినంత మాత్రాన లైసెన్స్ రద్దు చేస్తారా..? ఎఫ్డీఏ చర్యలను తప్పుబట్టిన బాంబే హైకోర్టు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో ఆటో షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..
- ●Bhagyashri Borse | నేను హీరోయిన్ కావడం మా అమ్మకు ఇష్టం లేదు - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్
- ●CM Revanth Reddy | నేనేందుకు రాజీనామా చేయాలి.. 2034 వరకు నేనే సీఎం
- ●Flipkart Pay Later | అకౌంట్లో డబ్బులు లేకున్నా ఫ్లిప్కార్ట్లో వస్తువులను కొనవచ్చు.. పే లేటర్ సర్వీస్ లాంచ్..
- ●KTR | ఫార్ములా ఈ-కారు రేసు కేసు.. రేపు కోర్టుకు కేటీఆర్

Bombay High Court | రెండు పురుగులు కనిపించినంత మాత్రాన లైసెన్స్ రద్దు చేస్తారా..? ఎఫ్డీఏ చర్యలను తప్పుబట్టిన బాంబే హైకోర్టు

Stock Markets | స్టాక్ మార్కెట్లలో ఆటో షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

Bhagyashri Borse | నేను హీరోయిన్ కావడం మా అమ్మకు ఇష్టం లేదు - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్

CM Revanth Reddy | నేనేందుకు రాజీనామా చేయాలి.. 2034 వరకు నేనే సీఎం






