త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apples DCM truck overturns | ఆపిల్ పండ్ల డీసీఎం బోల్తా.. నిమిషాల్లోనే లోడు పండ్లు లూటీ.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

Apples DCM truck overturns | ఆపిల్ పండ్లతో వెళ్తున్న డీసీఎం అదుపుత‌ప్పి బోల్తా ప‌డ‌డంతో జ‌నం ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డారు. ఒకానొక ద‌శ‌లో జాత‌ర‌ను త‌ల‌పించేలా గుమిగూడారు. సంచుల్లో, చీర కొంగుల్లో, ఆటోల్లో అందిన‌కాడికి పోటీ పడి మరీ ఎత్తుకెళ్లారు.

S

Telangana | Published On Jul 30, 2026, 5.17 pm IST

Apples DCM truck overturns | ఆపిల్ పండ్ల డీసీఎం బోల్తా.. నిమిషాల్లోనే లోడు పండ్లు లూటీ.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌
Advertisement

Apples DCM truck overturns | త్రినేత్ర‌.న్యూస్‌: ఆపిల్ పండ్లతో వెళ్తున్న డీసీఎం అదుపుత‌ప్పి బోల్తా ప‌డ‌డంతో జ‌నం ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డారు. ఒకానొక ద‌శ‌లో జాత‌ర‌ను త‌ల‌పించేలా గుమిగూడారు. సంచుల్లో, చీర కొంగుల్లో, ఆటోల్లో అందిన‌కాడికి పోటీ పడి మరీ ఎత్తుకెళ్లారు. దీంతో లోడు ఆపిల్ పండ్లు నిమిషాల వ్య‌వ‌ధిలోనే లూటీ అయ్యాయి. ఇంత‌కీ ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందంటే..

వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద గురువారం ఆపిల్ పండ్ల‌తో వెళ్తున్న డీసీఎం అదుపుత‌ప్పి బోల్తా పడింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో డీసీఎం వాహనం రోడ్డుపై పల్టీ కొట్టింది. దీంతో పండ్ల‌న్నీ చెల్లాచెదురుగా ప‌డ్డాయి. ఇది గ‌మ‌నించిన స్థానికులు, వాహ‌న‌దారులు వెంట‌నే అక్కడికి చేరుకుని ఆపిల్ పండ్లను ఎత్తుకెళ్లేందుకు ఎగబడ్డారు. క్ష‌ణాల్లోనే పండు లేకుండా మాయం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతున్నాయి.

కాగా డీసీఎం వాహ‌నం బోల్తా ప‌డిన ఘ‌ట‌న‌లో డ్రైవ‌ర్‌, క్లీన‌ర్‌కు గాయాలైన‌ప్ప‌టికీ ఎవ‌రూ అటువైపు చూడ‌లేదు. పండ్లు ఎత్తెకెళ్లేందుకే ఇంట్రెస్ట్ చూపారు. క‌నీసం క్షతగాత్రుల పరిస్థితిని పట్టించుకోక‌పోవ‌డంతో ఇదేనా మాన‌వ‌త్వం అంటూ సోష‌ల్‌మీడియా వేదిక‌గా ప‌లువురు మండిప‌డుతున్నారు.

Advertisement
Advertisement