త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Mataram Bill | వందేమాత‌రం బిల్లుకు పార్ల‌మెంట్ ఓకే

Vande Mataram Bill | జాతీయ గేయం వందేమాతరానికి చట్టపరమైన రక్షణలు కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన‌ వందేమాత‌రం బిల్లు (Vande Mataram Bill 2026)కు లోక్‌స‌భ ఆమోదం తెలిపింది.

D

National | Published On Jul 30, 2026, 4.51 pm IST

Vande Mataram Bill | వందేమాత‌రం బిల్లుకు పార్ల‌మెంట్ ఓకే
Advertisement

Vande Mataram Bill | త్రినేత్ర‌.న్యూస్ : జాతీయ గేయం వందేమాతరానికి చట్టపరమైన రక్షణలు కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన‌ వందేమాత‌రం బిల్లు (Vande Mataram Bill 2026)కు లోక్‌స‌భ ఆమోదం తెలిపింది. విప‌క్షాల ఆందోళ‌న మ‌ధ్యే మూజువాణి ఓటుతో ఈ బిల్లును దిగువ స‌భ ఆమోదించింది. ఇక బుధ‌వారం ఎగువ స‌భ వందేమాత‌రం బిల్లుకు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత ఈ బిల్లు అధికారికంగా చట్టంగా మారనుంది.

వందేమాతరాన్ని పాడుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా అంతరాయం కలిగించడాన్ని తీవ్ర‌మైన నేరంగా ప‌రిగ‌ణించేలా ఈ బిల్లును స‌వ‌ర‌ణ చేశారు. ఈ చట్టం ప్రకారం.. జాతీయ జెండా, రాజ్యాంగం వంటి జాతీయ చిహ్నాలను అవమానించినా లేదా ఆటంకం కలిగించినా, అగౌరపరిచినా నేరంగా పరిగణించి, గరిష్ఠంగా మూడేండ్ల జైలు శిక్ష, జ‌రిమానా విధిస్తారు. లేదంటే రెండూ విధించే అవ‌కాశం ఉంటుంది. అంతేకాదు, ఈ గేయాన్ని ఎక్కడ ఆలపించినా కేవలం కొన్ని చరణాల‌నే పాడ‌కుండా పూర్తి గేయాన్ని ఆల‌పించేలా నిబంధనను కూడా ఇందులో చేర్చారు. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్స వేడుకలు ఏడాది పొడవునా కేంద్రం నిర్వహిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జాతీయ గీతం జ‌న‌గ‌ణ‌మ‌ణ‌కు ఉన్నట్టే జాతీయం గేయమైన‌ వందేమాతరంనకు కూడా చట్టపరమైన రక్షణ కల్పించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.

Also Read..

రైతుల నిర‌స‌న‌కు త‌లొగ్గిన ప్ర‌భుత్వం.. ఆ పంట‌ సేకరణ పరిమితిని 25% నుంచి 60%కి పెంపు

రెండు పురుగులు క‌నిపించినంత మాత్రాన లైసెన్స్ ర‌ద్దు చేస్తారా..? ఎఫ్‌డీఏ చ‌ర్య‌ల‌ను తప్పుబ‌ట్టిన‌ బాంబే హైకోర్టు

నేను హీరోయిన్ కావ‌డం మా అమ్మ‌కు ఇష్టం లేదు - భాగ్య‌శ్రీ బోర్సే కామెంట్స్

Advertisement
Advertisement