త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | బ‌ర్త్ డే వేడుక‌ల‌కు కేటీఆర్ దూరం.. కార‌ణ‌మిదే..?

KTR | బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న బ‌ర్త్ డే వేడుక‌ల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఎందుకంటే.. దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన అణచివేత, దాడుల నేపథ్యంలో తన జన్మదినం నాడు ఎలాంటి వేడుకలు లేకుండా సాధారణంగా గడపాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు.

S

Telangana | Published On Jul 23, 2026, 3.01 pm IST

KTR | బ‌ర్త్ డే వేడుక‌ల‌కు కేటీఆర్ దూరం.. కార‌ణ‌మిదే..?
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న బ‌ర్త్ డే వేడుక‌ల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఎందుకంటే.. దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన అణచివేత, దాడుల నేపథ్యంలో తన జన్మదినం నాడు ఎలాంటి వేడుకలు లేకుండా సాధారణంగా గడపాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు.

ఢిల్లీలో విద్యార్థులు, యువత చేపట్టిన పోరాటానికి సంఘీభావం తెలుపుతూ, వారిపై జరిగిన దాడులను నిరసిస్తూ రేపు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్‌వీ) నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నట్లు కేటీఆర్ తెలిపారు. దీంతోపాటు రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులు, అటు రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా ఒక గంభీరమైన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తన 50వ జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కేక్ క‌టింగ్‌లు, ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు వ‌ద్దు..

అలాగే, తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు కేక్ కటింగ్‌లు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, పూల బొకేలు, పత్రికా ప్రకటనలు వంటి వాటిపై అనవసరంగా ఖర్చు చేయవద్దని పార్టీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆ ఖర్చులను తమకు చేతనైన మేరకు సేవా కార్యక్రమాలకు వినియోగించాలని, ఆపదలో ఉన్నవారికి, అవసరమైన వారికి సాయం అందేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారానే తన జన్మదినాన్ని అర్థవంతంగా నిర్వహించాలని కేటీఆర్ కోరారు.

Advertisement
Advertisement