త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaddi Raju Ravichandra | రైతులు గంట‌ల‌కొద్ది లైన్లలో నిల‌బ‌డుతున్న‌రు.. యూరియా అందేలా త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోండి

Vaddi Raju Ravichandra | ఈ ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ‌లో లక్షలాది మంది రైతులు విత్తనాలు వేసే పనుల్లో నిమగ్నమై ఉన్నారని, అవసరమైన ఎరువులు, యూరియాను సకాలంలో అందించాల‌ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గతేడాది ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణలో తీవ్రమైన యూరియా కొరత ఏర్పడడంతో రైతులు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వచ్చిందని వాపోయారు.

S

Telangana | Published On Jul 30, 2026, 4.20 pm IST

Vaddi Raju Ravichandra | రైతులు గంట‌ల‌కొద్ది లైన్లలో నిల‌బ‌డుతున్న‌రు.. యూరియా అందేలా త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోండి
Advertisement
  • రాజ్య‌స‌భ‌లో ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర డిమాండ్‌

Vaddi Raju Ravichandra | త్రినేత్ర‌.న్యూస్‌: ఈ ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ‌లో లక్షలాది మంది రైతులు విత్తనాలు వేసే పనుల్లో నిమగ్నమై ఉన్నారని, అవసరమైన ఎరువులు, యూరియాను సకాలంలో అందించాల‌ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం రంగం వెన్నుముక అని పేర్కొన్నారు. రాజ్యసభ జీరో అవర్‌లో గురువారం ఆయన మాట్లాడారు. ఈ క్లిష్ట దశలో ఆరోగ్యకరమైన పంట ఎదుగుదల, వ్యవసాయ ఉత్పాదకతను కాపాడటానికి ఎలాంటి అంతరాయం లేని ఎరువులను అందించడం అత్యవసరమని నొక్కి చెప్పారు. గతేడాది ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణలో తీవ్రమైన యూరియా కొరత ఏర్పడడంతో రైతులు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వచ్చిందని వాపోయారు.

రైతులు అనేక చోట్ల ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది. లైన్లలో నిలబడి ఉన్న సమయంలో రైతులు స్పృహ తప్పి పడిపోయిన, తోపులాటలో ప్రాణాలు కూడా కోల్పోయిన విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి బాధాకరమైన పరిస్థితులు పునరావృతం కాకూడదు. గతేడాది ఎదురైన అనుభవం, ప్రణాళిక, సమన్వయం, ఎరువుల సకాలంలో పంపిణీలో ఉన్న తీవ్రమైన లోపాలను బయటపెట్టింది. రైతు సంఘాలు, ప్రజాప్రతినిధుల నుంచి పదేపదే హెచ్చరికలు వచ్చినప్పటికీ, సకాలంలో తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిన సందర్భాలను ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నానన్నారు.

బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్‌ తెలంగాణకు అదనపు పరిమాణంలో యూరియాను వెంటనే విడుదల చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే కోరారు.ఈ విజ్ఞప్తుల పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అదనపు నిల్వలను విడుదల చేయడంతో పరిస్థితి కొంతవరకు మెరుగుప‌రిచరు. సకాలంలో చేసిన ఆ జోక్యాన్ని అభినందిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ పురోగతిలో ఉన్నందున, కొరత ఏర్పడిన తర్వాత స్పందించడం కంటే ముందస్తుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఎంపీ రవిచంద్ర కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు. రైతులు తమ పొలాల్లో పనులు చేసుకోకుండా మళ్లీ క్యూలైన్లలో విలువైన సమయాన్ని గడపవలసిన‌ పరిస్థితులు తలెత్తకూడదని, విత్తనాలు వేసే, పంట ఎదుగుదల దశల్లో ఎరువులను అందుబాటులో ఉంచడం, అందించడం అత్యంత కీలకమని రవిచంద్ర తెలిపారు. ఈ విషయంలో స్వల్ప జాప్యం కూడా పంట దిగుబడిని, రైతుల ఆదాయానికి ప్రతికూల ప్రభావితం చూపుతుందన్నారు.

ప్ర‌తి జిల్లాకు చేరేలా..

ఈ అత్యున్నత సభ ద్వారా తెలంగాణలో యూరియా డిమాండ్ సరఫరాను నిశితంగా పరిశీలించాలన్నారు. వాస్తవ క్షేత్రస్థాయి అవసరాల ఆధారంగా తగినంత సకాలంలో కేటాయింపులు జరిగేలా చూడాలని ఎంపీ రవిచంద్ర కోరారు. ఎరువులు ఆలస్యం కాకుండా ప్రతి జిల్లాకు చేరేలా రాష్ట్ర ప్రభుత్వంతో సమర్థవంతంగా సమన్వయం చేసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం తన పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని, జిల్లా, మండల స్థాయిలలో తగినంత బఫర్ నిల్వలను నిర్వహించాలని, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను నిరోధించాలని, రైతులు ఇబ్బందులు పడకుండా యూరియాను పొందేలా చూడాల్సిందిగా ఎంపీ రవిచంద్ర సూచించారు.

రైతులకు సకాలంలో మద్దతు లభించాల‌ని చెప్పారు. కానీ అనిశ్చితి, కష్టాలు రాకూడదన్నారు. గత సంవత్సరం చూసిన బాధాకరమైన దృశ్యాలు మళ్లీ ఎన్నడూ పునరావృతం కాకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పొడవునా తెలంగాణ రైతులకు నిరంత‌రంగా యూరియా అందించాల‌ని, ఇందుకు క్రియాశీలక చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ వద్దిరాజు డిమాండ్ చేశారు.

 

Advertisement
Advertisement