KYC Scam | కేవైసీ పేరుతో మెసేజ్ వచ్చిందా? క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ అవుతుంది జాగ్రత్త..!
KYC Scam | ప్రస్తుతం సైబర్ మోసగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుని కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అందులో అత్యంత సాధారణంగా ఉపయోగిస్తున్న పద్ధతి నకిలీ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఎస్‌ఎంఎస్ లేదా వాట్సాప్ సందేశాలు పంపడం.
Technology | Published On Jul 30, 2026, 5.18 pm IST
KYC Scam | ప్రస్తుతం సైబర్ మోసగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుని కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అందులో అత్యంత సాధారణంగా ఉపయోగిస్తున్న పద్ధతి నకిలీ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఎస్‌ఎంఎస్ లేదా వాట్సాప్ సందేశాలు పంపడం. ఇటీవల మీకూ బ్యాంక్ ఖాతా కేవైసీ అప్‌డేట్ చేయకపోతే ఖాతాను మూసివేస్తామని హెచ్చరిస్తూ మెసేజ్ వచ్చి ఉంటే అప్రమత్తంగా ఉండాలి. ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు నకిలీ సందేశాలు పంపి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ సందేశంలో ఒక లింక్ పంపించి, వెంటనే కేవైసీ పూర్తి చేయకపోతే బ్యాంక్ ఖాతాను మూసివేస్తామని పేర్కొంటారు. ఇలాంటి సందేశాలు చూసిన చాలా మంది భయాందోళనకు గురై ఆలోచించకుండా లింక్‌పై క్లిక్ చేస్తుంటారు. ఇదే సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడేందుకు కారణమవుతోంది. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) హెచ్చరిస్తోంది.
నకిలీ సందేశాలతో మోసాలు..
మొదట సైబర్ మోసగాళ్లు కేవైసీ అప్‌డేట్ చేయాలంటూ నకిలీ ఎస్‌ఎంఎస్ లేదా వాట్సాప్ సందేశాలు పంపిస్తారు. అందులో నిర్దిష్ట గడువులోగా కేవైసీ పూర్తి చేయకపోతే బ్యాంక్ ఖాతా మూసివేస్తామని పేర్కొంటారు. దీంతో భయపడిన వినియోగదారులు అందులో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేస్తారు. ఆ తర్వాత మోసగాళ్లు వారి బ్యాంకింగ్ వివరాలను సేకరించి ఖాతాలోని డబ్బును దోచుకుంటారు. నకిలీ లింక్ ద్వారా మీరు అసలు బ్యాంక్ వెబ్‌సైట్‌లా కనిపించే ఫేక్ వెబ్‌సైట్‌కు మళ్లుతారు. అక్కడ కేవైసీ పేరుతో మీ బ్యాంక్ ఖాతా నంబర్, ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్ వంటి వివరాలు నమోదు చేయాలని కోరుతారు. ఈ సమాచారం మోసగాళ్ల చేతికి చేరితే మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బును ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. చిన్న పొరపాటు కూడా భారీ ఆర్థిక నష్టానికి దారితీస్తుంది.
ఏం చేయాలి.. ఏం చేయకూడదు..
ఇలాంటి సందేశాల ద్వారా ఎవరైనా వెంటనే చర్య తీసుకోవాలని ఒత్తిడి చేస్తే ప్రశాంతంగా ఉండాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. బ్యాంకులు కేవైసీ అప్‌డేట్ కోసం ఎప్పుడూ ఎస్‌ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా వ్యక్తిగత సమాచారం అడగవు. కాబట్టి ఏ సమాచారం వచ్చినా సంబంధిత బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా సమీప శాఖ ద్వారా మాత్రమే ధ్రువీకరించాలి. తెలియని లింక్‌లపై క్లిక్ చేయకూడదు. అలాగే ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్ లేదా ఇతర బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు. ఇలాంటి సందేశాలు వస్తే నకిలీ లింక్‌పై క్లిక్ చేయకూడదు. సందేశం నిజమో కాదో నేరుగా మీ బ్యాంకును సంప్రదించి తెలుసుకోవాలి. పొరపాటున లింక్‌పై క్లిక్ చేసి ఉంటే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. అవసరమైతే సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలి. సైబర్ క్రైం పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మోసాన్ని పసిగట్టిన వెంటనే స్పందిస్తే నష్టం జరిగే అవకాశాలను దాదాపుగా నివారించవచ్చు.
తాజావార్తలు
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా
- ●Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
- ●Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
- ●Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
- ●KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట

Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?






