Jagadish Reddy | నీలాంటి క్రిమినల్‌ను ఎన్నుకోవడమే.. ఒక క్రిమినల్ వేస్ట్ రేవంతూ..! : జగదీశ్ రెడ్డి
Jagadish Reddy | ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఓ క్రిమినల్ వేస్ట్ అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. నీలాంటి క్రిమినల్‌ను ఎన్నుకోవడమే ఒక క్రిమినల్ వేస్ట్ రేవంతూ అని విరుచుకుపడ్డారు.
Jagadish Reddy | త్రినేత్ర.న్యూస్ : ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఓ క్రిమినల్ వేస్ట్ అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. నీలాంటి క్రిమినల్‌ను ఎన్నుకోవడమే ఒక క్రిమినల్ వేస్ట్ రేవంతూ అని విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖుడిని విద్యాశాఖ మంత్రిగా ఉంచినందుకు 250 మందిని బలి తీసుకున్నాడని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు.
ఒక తరానికి నాణ్యమైన విద్యని అందించి ప్రపంచంలో ఎవరితో అయినా పోటీపడగలం అనే విశ్వాసాన్ని ఇస్తే అదే తిరుగులేని సమాజం అవుతుందని కేసీఆర్ గురుకుల పాఠశాలలు ప్రారంభించాడు. రేవంత్ రెడ్డి లాగా కేసీఆర్ మాటలు చెప్పలేదు.. పని చేసి చూపించాడు. హోమ్, మున్సిపల్ శాఖలను సీఎం తన వద్ద పెట్టుకొని.. అటు లా అండ్ ఆర్డర్‌ను దెబ్బతీశావ్, ఇటు మున్సిపల్ వ్యవస్థను పూర్తిగా మంటగలిపావ్ అని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ విషప్రచారం చేస్తూనే.. కాళేశ్వరంలోని నందిమేడారం, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారానే ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరుకు నీటిని తరలిస్తుంది. ఎస్సార్ఎస్పీ నిండే పరిస్థితి లేదు కాబట్టి, వెంటనే కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించి, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపి మా సూర్యాపేట జిల్లాకు నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
మోదీ లాగా రేవంత్ రెడ్డి కూడా బిల్ పాస్ చేసుకునేందుకు ఒక రోజు అసెంబ్లీ పెట్టుకున్నాడు. అదేమన్న నీ కార్పొరేట్ దందా ఆఫీసా..? ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి? వాళ్ళకంటే పెద్ద మేధావి నేనే అని రేవంత్ రెడ్డి పరోక్షంగా చెప్పుకున్నాడని మాజీ మంత్రి నిప్పులు చెరిగారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పకుండానే విద్యుత్ కోతలు విధిస్తోంది. గతంలో సమైక్య ఆంధ్ర పాలకులు చేసినట్లే ఇప్పుడు కూడా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు అని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు – సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
జులై 30, 2026

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అంటావా
జులై 30, 2026

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
జులై 30, 2026
తాజావార్తలు
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా
- ●Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
- ●Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
- ●Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
- ●KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట

Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?



