Devadula | హరీశ్‌రావు వార్నింగ్.. దేవాదుల 9 పంపులు ఆన్..
Devadula | సాగునీళ్ల కోసం బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు నిర్విరామంగా చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. రైతులకు సాగునీరు ఇవ్వాలని హరీశ్‌రావు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలకు రేవంత్ సర్కార్ దిగొచ్చింది.
Devadula | త్రినేత్ర.న్యూస్ : సాగునీళ్ల కోసం బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు నిర్విరామంగా చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. రైతులకు సాగునీరు ఇవ్వాలని హరీశ్‌రావు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలకు రేవంత్ సర్కార్ దిగొచ్చింది. దేవాదుల ప్రాజెక్టులో 10 మోటర్లు ఆన్ చేసి రైతులకు సాగు నీరు అందజేయాలన్న హరీశ్‌రావు డిమాండ్‌కు ప్రభుత్వం దిగొచ్చి.. నీటిని విడుదల చేసింది. అటు రైతులు, ఇటు ప్రతిపక్ష పార్టీ నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో 5 మోటర్లు నడుస్తున్న దేవాదుల ప్రాజెక్టులో 9 మోటర్లు ఆన్ చేశారు నీటిపారుదల శాఖ అధికారులు. దీంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు నీళ్ల వరద పోటెత్తింది. ప్రస్తుతం సమ్మక్క సాగర్ ఇన్ ఫ్లో 40,200 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 38,410 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 1790 క్యూసెక్కుల నీటిని అధికారులు ఎత్తిపోతున్నారు.
నిన్న హరీశ్‌రావు ఏం డిమాండ్ చేశారంటే..?
జూలై 12వ తేదీన తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టి దేవాదుల పంపులు ఆన్ చేయమని నిలదీశాం. 13వ తేదీన ఉత్తం, భట్టి, పొంగులేటి హెలికాప్టర్‌లో వెళ్లి హడావుడి చేశారు. అక్కడికి వెళ్లి దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో కూడా నీళ్ల మంత్రికి తెలియదు. మొత్తం 22 రిజర్వాయర్లు నింపుతాం, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతాం అని చెప్పారు. ఆ మాటలు నమ్మి రైతులు నారు పోసుకున్నారు. ఇప్పుడు నీళ్లు ఇవ్వడం లేదు. నీళ్లు ఎత్తడం లేదు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా నీళ్ల కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారు. శాయంపేట, బీమదేవపల్లి, ఎల్కతుర్తి అంతటా ఆందోళనలు జరుగుతున్నాయి. నీళ్లు ఉండి కూడా ఎందుకు ఎత్తడం లేదు? అని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ సమ్మక్క బ్యారేజీ కట్టారు. 3 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 22 వేల క్యూసెక్కుల వరద ఉంది. ఆయకట్టుకు సరిపడా నీళ్లు ఉండి కూడా పంటలకు నీళ్లు ఇవ్వడం లేదు. పది పంపులు నడుస్తాయని చెప్పారు. నిన్నటి వరకు ఐదు పంపులే నడిచాయి. ఇక్కడ ఎన్డీఎస్ఏ అడ్డంకి లేదు కదా? చంద్రబాబుకు నీళ్లు విడిచిపెట్టడమా? తెలంగాణ రైతులకు నీళ్లు ఒడిసిపట్టడమా? మీ ఆలోచన ఏమిటి? అని నిలదీశారు.
ప్రజా పోరుకు సిద్ధమవుతాం..
చిల్లర రాజకీయాలు బంద్ చేయండి. చిత్తశుద్ధితో దేవాదుల 10 మోటార్లు నడపాలి. 22 రిజర్వాయర్లు నింపాలి. 3 లక్షల 17 వేల ఎకరాలకు తాగు, సాగు నీరు అందించాలి. లేకపోతే వరంగల్, నల్గొండ, కరీంనగర్ రైతులతో కలిసి ప్రజాపోరుకు సిద్ధమవుతాం. ఉద్యమాలు ప్రారంభం కాకముందే కళ్లు తెరవండి అని హరీశ్‌రావు హితవు పలికారు.
తాజావార్తలు
- ●Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం
- ●Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు
- ●Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
- ●Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం

Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం

Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు

Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ

Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్





