Cyber Scam | బాలీవుడ్ నటికి షాకిచ్చిన సైబర్ కేటుగాళ్లు – ఓటీపీ, పిన్ లేకుండా లక్షలు దోచేశారు
బాలీవుడ్ నటి కీర్తి కుల్హారికి సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. ఆమె క్రెడిట్ కార్డ్ వివరాలను చోరీ చేసి లక్షలు దోచేశారు. ఉరి, మిషన్ మంగళ్, పింక్ సినిమాలతో బాలీవుడ్‌లో ఫేమస్ అయ్యింది కీర్తి కుల్హారి.
Entertainment | Published On Jul 30, 2026, 5.14 pm IST
Cyber Scam | బాలీవుడ్ నటి కీర్తి కుల్హారికి సైబర్ స్కామ్ బారిన పడింది. ఎలాంటి ఓటీపీ, పిన్ వివరాలు లేకుండానే సైబర్ కేటుగాళ్లు ఆమె నుంచి లక్షల రూపాయలు దోచేశారు. సైతాన్, పిక్, ఉరి వంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. సినిమాల్లోనే కాకుండా పలు వెబ్‌సిరీస్‌లలో నటించింది.
క్రెడిట్ కార్డ్ వివరాలు...
ఇటీవల కీర్తి కుల్హారి క్రెడిట్ కార్డ్ వివరాలను చోరీ చేసిన సైబర్ నేరగాళ్లు 2.43లక్షల అనధికారిక లావాదేవీలు జరిపారు. ఈ మోసంపై ముంబైలోని ఆంబోలీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. జూలై 24న ముంబైలోని ఓ థియేటర్‌లో సినిమా చూసేందుకు వెళుతుండగా బ్యాంకు నుంచి తనకు ఓ మెసేజ్ వచ్చిందని, తన క్రెడిట్ కార్డ్ ద్వారా ఏరోమెక్సికో ఎయిర్‌లైన్స్ 2525 యూఎస్ డాలర్లు ట్రాన్స్‌ఫర్ అయినట్లు అందులో ఉందని కీర్తి కంప్లైంట్‌లో పేర్కొన్నది. ఈ మోసంపై వెంటనే కస్టమేర్ కేర్‌కు కాల్ చేసినట్లు చెప్పింది. ఆమె క్రెడిట్ కార్డ్ నుంచి నాలుగు విడతలుగా 2.43 లక్షలు డ్రా అయినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఆమె కార్డ్‌ను బ్లాక్ చేశారు.
ఓటీపీ లేకుండా...
క్రెడిట్ కార్డ్ ఓటీపీ, పిన్ లాంటి వివరాలను ఎవరితో పంచుకోలేదని పోలీసులకు కీర్తి తెలిపినట్లు సమాచారం. క్రెడిట్ కార్డ్ లేదంటే ఆమె మొబైల్‌ను హ్యాక్ చేసి డబ్బులను దోచేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సైబర్ నిపుణుల సాయంతో ఈ కేసుపై ఇన్వేస్టిగేషన్‌ను జరుపుతున్నారు.
ఫోర్ మోర్ షాట్స్...
అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఫోర్ మోర్ షాట్స్ అనే వెబ్‌సిరీస్‌తోనే యాక్టర్‌గా ఫేమస్ అయ్యింది కీర్తి కుల్హారి. ఈ సిరీస్‌లో నటించిన రాజీవ్ సిద్ధార్థతో చాలా కాలంగా ప్రేమలో ఉంది. త్వరలోనే వీరిద్దరు పెళ్లిచేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KYC Scam | కేవైసీ పేరుతో మెసేజ్ వచ్చిందా? క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ అవుతుంది జాగ్రత్త..!
జులై 30, 2026

Instagram | మెటాకు కేంద్రం నోటీసులు.. ఇన్‌స్టా యాడ్స్‌పై వివరణ కోరిన ఐటీశాఖ..!
జులై 3, 2026

SIM Swapping | సిమ్ స్వాపింగ్ మోసాలతో జాగ్రత్త.. నిర్లక్ష్యం చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి..
జూన్ 23, 2026
తాజావార్తలు
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా
- ●Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
- ●Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
- ●Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
- ●KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట

Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?



