త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PNG | పీఎన్‌జీకి మార‌క‌పోతే ఎల్పీజీ క‌నెక్ష‌న్ క‌ట్.. కేంద్రం కీల‌క ఉత్త‌ర్వులు

PNG | పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతిన్న నేపథ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పైప్డ్‌ నేచుర‌ల్ గ్యాస్ (PNG) అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగ‌దారులు ఆ క‌నెక్ష‌న్‌కు మారాల‌ని సూచించింది.

D

National | Published On Mar 25, 2026, 3.29 pm IST

PNG | పీఎన్‌జీకి మార‌క‌పోతే ఎల్పీజీ క‌నెక్ష‌న్ క‌ట్.. కేంద్రం కీల‌క ఉత్త‌ర్వులు
Advertisement

PNG | పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతిన్న నేపథ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పైప్డ్‌ నేచుర‌ల్ గ్యాస్ (PNG) అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగ‌దారులు ఆ క‌నెక్ష‌న్‌కు మారాల‌ని సూచించింది. లేదంటే వంట గ్యాస్ సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రా (LPG Supply) నిలిపివేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు కేంద్ర పెట్రోలియం, స‌హ‌జ‌వాయువు మంత్రిత్వ శాఖ (Ministry of Petroleum and Natural Gas) మార్చి 24న కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది.

మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ ప్ర‌కారం.. పైప్డ్‌ నేచుర‌ల్ గ్యాస్ (piped natural gas) అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు క‌చ్చితంగా పీఎన్‌జీకి మారాల్సి ఉంటుంది. మీకు పీఎన్‌జీ గ్యాస్ అందుబాటులో ఉంది అని అధికారుల నుంచి నోటీసు అందిన మూడు నెల‌ల్లోనే వినియోగ‌దారులు పీఎన్‌జీ క‌నెక్ష‌న్‌ను ఎంచుకోవాలి. నిర్ణీత గ‌డువులోగా పీఎన్‌జీకి మార‌క‌పోతే.. ఎల్పీజీ కనెక్షన్‌ను శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇంటికి పీఎన్‌జీ కనెక్షన్ ఇవ్వడం సాంకేతికంగా సాధ్యం కాదని అధికారులు గుర్తిస్తే.. వారు 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) పొందిన తర్వాత ఎల్పీజీని యథావిధిగా వాడుకోవచ్చు.

పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం ప్ర‌భావంతో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతింది. ఈ నేపథ్యంలో మ‌న‌దేశం కూడా ఎల్పీజీ కొర‌త‌ను ఎదుర్కొంటోంది. ఈ కొర‌త‌ను అధిగ‌మించ‌డంతోపాటూ గ్యాస్ స‌ర‌ఫ‌రాలో స‌మూల మార్పులు చేప‌ట్టే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది. మ‌న ఇంటికి క‌రెంట్‌ క‌నెక్ష‌న్ ఉన్న‌ట్లే ఈ పీఎన్‌జీ క‌నెక్ష‌న్ భూగ‌ర్భ పైప్‌లైన్ ద్వారా అందిస్తారు. ఈ గ్యాస్ నేరుగా వంట‌గ‌దికే స‌ర‌ఫ‌రా అవుతుంది. దీని వ‌ల్ల గ్యాస్ అయిపోతుంద‌న్న భ‌యం ఉండ‌దు. ప‌దేప‌దే రీఫిల్ చేయించుకోవాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. మీరు ఎంత వాడుకుంటే అంత‌కే రీడింగ్ ప్ర‌కారం బిల్లు చెల్లించుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు సైతం పీఎన్‌జీకి మారితే ప్రోత్సాహ‌కాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టిస్తున్నాయి.

ఈ ప్రాంతాల్లో అందుబాటులో పీఎన్‌జీ

హైద‌రాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో పైప్డ్ నేచుర‌ల్ గ్యాస్ అందుబాటులో ఉంది. ఈ గ్యాస్‌ను భాగ్య‌న‌గ‌ర్ గ్యాస్ లిమిటెడ్ స‌ర‌ఫ‌రా చేస్తోంది. ఇది గెయిల్ (GAIL), హెచ్‌పీసీఎల్ (HPCL) సంయుక్త సంస్థ. శామీర్‌పేట్‌, మేడ్చ‌ల్, కొంపల్లి, జీడిమెట్ల, సుచిత్ర, కుతుబుల్లాపూర్, అల్వాల్, నిజాంపేట్, చింతల్, బాలానగర్, కూకట్‌పల్లి, మలేషియ‌న్‌ టౌన్‌షిప్, హఫీజ్‌పేట్, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్ వాసుల‌కు ఈ గ్యాస్ అందుబాటులోనే ఉంది.

యూనిట్‌కు రూ.51..

పీఎన్‌జీ గ్యాస్ ధ‌ర కూడా ఎల్పీజీ ధ‌ర‌తో ఇంచుమించు స‌మానంగానే ఉంటుంది. అయితే, ఎల్పీజీని సిలిండ‌ర్ ద్వారా తీసుకుంటాం. ప్ర‌స్తుతం సిలిండ‌ర్ ధ‌ర రూ.960 వ‌ర‌కూ ఉంది. అదే పీఎన్‌జీ ధ‌ర‌ను యూనిట్‌తో కొలుస్తారు. ఒక్కో యూనిట్‌కు రూ.51 (Standard Cubic Meter) వ‌ర‌కూ ధ‌ర ఉంటుంది. ఒక మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి నెల‌కు సుమారు 10 నుంచి 15 SCM పీఎన్‌జీ అవ‌స‌ర‌మ‌వుతుంది. మీటర్ రీడింగ్ ప్రకారం మీరు ఎంత గ్యాస్ వాడుకుంటే అంతకే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.

Also Read..

ఎవ‌రో ఎందుకు.. రేవంత్ రెడ్డే నాపై పోటీకి దిగాలి.. హ‌రీశ్‌రావు స‌వాల్

మంట‌పెట్టి వండుకోండి.. గ్యాస్ కొర‌త‌పై సీఎం రేవంత్ కీల‌క‌ వ్యాఖ్య‌లు

ఏపీ నుంచి త‌క్ష‌ణ‌మే తెలంగాణ‌కు రూ.1,270 కోట్లు బ‌దిలీ చేయించాలి: చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి

Advertisement

తాజావార్తలు

Advertisement