Commercial LPG prices hiked | వాణిజ్య సిలిండర్‌పై మళ్లీ బాదుడు.. సీఎన్‌జీ, జెట్ ఇంధన ధరలూ పెంపు
Commercial LPG prices hiked | వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి షాకిచ్చాయి. సెప్టెంబర్ నెల ప్రారంభంలో గ్యాస్, సీఎన్‌జీ, జెట్ ఇంధన ధరలను సవరించాయి.
Commercial LPG prices hiked | త్రినేత్ర.న్యూస్ : వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి షాకిచ్చాయి. సెప్టెంబర్ నెల ప్రారంభంలో గ్యాస్, సీఎన్‌జీ, జెట్ ఇంధన ధరలను సవరించాయి. వాణిజ్య అవసరాల కోసం (Commercial LPG Cylinder) వినియోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. యూనిట్‌కు సుమారుగా రూ.9.50 నుంచి రూ.11.50 వరకు పెరిగింది. తాజాగా సవరించిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో ఎల్పీజీ ధర రూ. 2,747.50, ముంబైలో రూ.2,701, కోల్‌కతాలో రూ.2,884, చెన్నైలో రూ.2,916.50, హైదరాబాద్‌లో రూ.2,996కు పెరిగింది. కాగా, జులై, ఆగస్టు నెలల్లో కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించిన ఆయిల్ కంపెనీలు.. ఇప్పుడు పెంచడం గమనార్హం. మరోవైపు గృహావసరాలకు (Domestic Gas Cylinder) వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పూ లేదు.
విమాన ఛార్జీలకు రెక్కలు..?
ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు కూడా పెరిగాయి. లీటరుకు రూ. 6.28 (5.46 శాతం) పెరిగింది. దీంతో లీటరు ఏటీఎఫ్ ధర రూ.121.28కి ఎగబాకింది. గత ఆగస్టు 1న లీటరుకు రూ.5 చొప్పున పెంచిన విషయం తెలిసిందే. తాజాగా మరో రూ.6.28 పెంచి ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థలు విమాన ప్రయాణికులకు షాకిచ్చాయి. ఇంధన ధరల పెంపుతో పడే ఆర్థిక భారాన్ని విమానయాన సంస్థలు ప్రజల నెత్తినే వేయనున్నాయి. దీంతో విమాన ఛార్జీలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది.
మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు
సీఎన్‌జీ ధరలు (CNG Price Hike) మళ్లీ పెరిగాయి. మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరను కిలోకు రూ. 2 చొప్పున పెంచింది. దీంతో ముంబై, దాని పరిసర ప్రాంతాల్లో సవరించిన సీఎన్‌జీ ధర కిలోకు రూ. 88కి పెరిగింది. అదేవిధంగా దేశీయ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) ధర స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (SCM)కు రూపాయి చొప్పున పెరిగింది. పెరిగిన ధరలు నేటి అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. కాగా, రెండు రోజుల క్రితం ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) కిలో సీఎన్‌జీపై రూ.3.89 పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహానగర్ గ్యాస్ లిమిటెడ్ కూడా ధరలను పెంచింది.
Also Read..
నేపాల్ జలవిలయం.. 1000 దాటిన మృతులు.. 4000 మంది మిస్సింగ్
విదేశీ ప్రయాణాలు, బంగారం కొనుగోళ్లు వద్దు.. జీడీపీ వృద్ధిపై దేశ ప్రజలకు ప్రధాని అభినందనలు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి






