Petroleum Ministry | ఆ ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ
Petroleum Ministry | ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అవన్నీ తప్పుడు కథనాలే అని కొట్టిపారేసింది.
Petroleum Ministry | ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అవన్నీ తప్పుడు కథనాలే అని కొట్టిపారేసింది. ఇంధన ధరల్లో ఎలాంటి మార్పూ లేదని, ధరల పెంపు ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ (Ministry of Petroleum and Natural Gas ) ఎక్స్ వేదికగా స్పష్టతనిచ్చింది.
ఏకైక దేశం భారతే..
"దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, అది అవాస్తవం. ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం పరిశీలనలో లేదు" అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తప్పుదోవ పట్టించే వార్తలను ప్రజలు నమ్మొద్దని సూచించింది. అంతేకాదు, గత నాలుగేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగని ఏకైక దేశం భారతదేశమేనని ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ.. ప్రజలపై ఆ భారం పడకుండా ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
లీటరుపై రూ. 28 బాదుడు..
గత కొంతకాలంగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో భారీగా పెరగనున్నట్లు (Petrol Price Hike) ఈక్విటీస్ అనే స్టాక్ బ్రోకరేజ్ సంస్థ నివేదించిన విషయం తెలిసిందే. తమిళనాడు, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 29తో ముగియనున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ నెలాఖరు లేదా, మే మొదటి వారంలో ఆయిల్ కంపెనీలు ఇంధన ధరలను సవరించే అవకాశం ఉందని పేర్కొంది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పెంచితే ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులపై భారం పడుతుందని.. అందుకే దశల వారీగా పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ నివేదికతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్రం దీనిపై స్పష్టతనిచ్చింది.
FAKE NEWS
There are some news reports suggesting a price hike of petrol and diesel. It is hereby clarified that there is no such proposal under consideration by the Government.
Such news items are designed to create fear and panic amongst the citizens and are mischievous and… pic.twitter.com/yTAfJdah2o— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) April 23, 2026
Also Read..
చెదిరిన డాలర్ కల.. అమెరికాను వీడేందుకు సిద్ధమైన 40 శాతం మంది భారతీయులు
పెరుగుతున్న ఎండ తీవ్రత.. ఈ జాగ్రత్తలు మస్ట్
తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






