Chamala Kiran Kumar Reddy | ఏపీ నుంచి తక్షణమే తెలంగాణకు రూ.1,270 కోట్లు బదిలీ చేయించాలి: చామల కిరణ్‌కుమార్ రెడ్డి
Chamala Kiran Kumar Reddy | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం నుంచి తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి తక్షణమే రూ.1,270 కోట్ల నిధులను బదిలీ చేయించాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి (Chamala Kiran Kumar Reddy) కేంద్రప్రభుత్వాన్ని కోరారు.
Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్ : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం నుంచి తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి తక్షణమే రూ.1,270 కోట్ల నిధులను బదిలీ చేయించాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి (Chamala Kiran Kumar Reddy) కేంద్రప్రభుత్వాన్ని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా విభజన చట్టం ప్రకారం ఏపీ చెల్లించాల్సిన బకాయిలను తెలంగాణపై మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిధులను తిరిగి తెలంగాణకు బదిలీ చేయించాలని కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో రూల్ 377 కింద చామల మాట్లాడుతూ 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మొత్తం బకాయి రూ. 5,894.60 కోట్లు ఉండగా, నిర్ణయించిన నిష్పత్తి ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 59.54 శాతం, తెలంగాణకు 40.46 శాతం బకాయిలు కేటాయించాలని % బాధ్యతలు కేటాయించాల్సి ఉందని చెప్పారు. కానీ దీనికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌పై అదనంగా రూ. 1,052.70 కోట్ల భారం మోపిందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లోనూ తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిరసన వ్యక్తం చేస్తూనే ఆగస్టు 2024 వరకు మొత్తం రూ. 1,270 కోట్లు చెల్లించిందని గుర్తు చేశారు. ఇందులో రూ. 481.82 కోట్లు అసలు మొత్తం కాగా, రూ. 788.18 కోట్లు వడ్డీగా చెల్లించారని వివరించారు. ఈ మొత్తాన్ని తిరిగి పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించిందని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపించినప్పటికీ, అవి పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు, సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, ఈ విషయంపై తక్షణ చర్యలు తీసుకుని రూ.1,270 కోట్లను ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ





