త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఎవ‌రో ఎందుకు.. రేవంత్ రెడ్డే నాపై పోటీకి దిగాలి.. హ‌రీశ్‌రావు స‌వాల్

Harish Rao | రాబోయే ఎన్నిక‌ల్లో సిద్ధిపేట ఎమ్మెల్యేను ఓడించండి అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఎవ‌రో ఎందుకు.. రేవంత్ రెడ్డినే నాపై పోటీకి దిగాలి.. తేల్చుకుందాం అని హ‌రీశ్‌రావు సీఎంకు స‌వాల్ విసిరారు.

S

Telangana | Published On Mar 25, 2026, 3.21 pm IST

Harish Rao | ఎవ‌రో ఎందుకు.. రేవంత్ రెడ్డే నాపై పోటీకి దిగాలి.. హ‌రీశ్‌రావు స‌వాల్
Advertisement

ఏ టైమ్‌లో గోల్ కొట్టాలో బీఆర్ఎస్‌కు బాగా తెలుసు..
కేసీఆర్ ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయం..
అసెంబ్లీ స‌మావేశాలు పొడిగించాలి..
నిరుద్యోగుల‌ను దగా చేసింది..
కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తుంది..?
అసెంబ్లీని న‌డిపించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం
మీడియాతో హ‌రీశ్‌రావు చిట్ చాట్

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాబోయే ఎన్నిక‌ల్లో సిద్ధిపేట ఎమ్మెల్యేను ఓడించండి అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఎవ‌రో ఎందుకు.. రేవంత్ రెడ్డినే నాపై పోటీకి దిగాలి.. తేల్చుకుందాం అని హ‌రీశ్‌రావు సీఎంకు స‌వాల్ విసిరారు. అసెంబ్లీలో హ‌రీశ్‌రావు మీడియాతో చిట్ చాట్ చేశారు.

రేవంత్ రెడ్డి త‌ల కింద‌కు పెట్టి కాళ్లు పైకి పెట్టి త‌పస్సు చేసినా వ‌చ్చేసారి వ‌చ్చేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే. ముఖ్య‌మంత్రి అయ్యేది కేసీఆర్‌యే. సిద్దిపేట‌లో ఇత‌రులెందుకు.. రేవంత్ రెడ్డినే పోటీ చేయ‌మ‌నండి. డీలిమిటేష‌న్ ఎప్పుడో జ‌ర‌గాలి.. సీట్లు పెరిగి, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల అమ‌లు జ‌రిగితే స్వాగ‌తిస్తాం. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన పార్టీ బీఆర్ఎస్. ఏ టైమ్‌లో గోల్ కొట్టాలో బీఆర్ఎస్‌కు బాగా తెలుసు. బీఆర్ఎస్ త‌ప్ప‌కుండా గోల్ కొడుతుంది. బీఆర్ఎస్ అధికారంలోకి రావ‌డం ఖాయం.. కేసీఆర్ ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయమ‌ని హ‌రీశ్‌రావు తేల్చిచెప్పారు.

ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసింది..

ఇంకో వారం రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పొడిగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అన్ని అంశాలపై చర్చ జరగాలంటే మరో వారం రోజుల పాటు అసెంబ్లీ జరగాలి. సభ జరుగుతున్న తీరు అస్సలు బాగాలేదు. ఈరోజు రెండు ముఖ్యమైన ప్రశ్నలు చర్చకు రాకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని కేటీఆర్ అడిగిన ప్రశ్నకు.. 16 నోటిఫికేషన్లు, 16,978 ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం సమాధానం చెప్పింది. బీఆర్ఎస్ హయంలో ఇచ్చిన ఉద్యోగాలు 50,785 మందికి నియామక పత్రాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకుంటుంది. ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసింది అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తుంది..?

వెల్ఫేర్ బోర్డ్స్ కార్పొరేషన్‌లపై స్పష్టత ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. 33 కార్పొరేషన్‌లకు, 16 కార్పొరేషన్‌లకే కార్యాలయాలు ఉన్నాయి అని సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో రజక ఫెడరేషన్‌కు రూ. 386 కోట్లు పెట్టి ఒక కోటి ఖ‌ర్చు చేసిన‌ట్లు స‌మాధానం ఇచ్చారు. నాయి బ్రాహ్మణలకు రూ. 280 కోట్లు పెట్టి రూ. 30 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. మున్నూరు కాపులకు రూ. 100 కోట్లు కేటాయించి , ఒక్క రూపాయి ఖర్చు చెయ్యలేదు. కృష్ణ బలిజ (పూసల)కు రూ. 100 కోట్లు కేటాయించి, ఒక్క రూపాయి ఖర్చు చేయ‌లేదు. ఆర్యవైశ్యలకు రూ. 25 కోట్లు కేటాయించి, ఒక్క రూపాయి ఖర్చు చేయ‌లేదు. బీసీ కార్పొరేష‌న్‌కు రూ. 1,370 కోట్లు పెట్టి, రూ. 6 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఎస్టీ కార్పొరేష‌న్‌కు రూ. 2,730 కోట్లు పెట్టి, రూ. 52 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌కు రూ. 5,403 కోట్లు పెట్టి, రూ. 74 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల ప‌ట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ నిధులు ప‌క్క‌దారి మ‌ళ్లించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అతితక్కువ నిధులు అంటే 2 శాతం నిధులు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తుంది..? బ‌డ్జెట్ అన్ని వ‌ర్గాల‌ను నిరాశ‌ప‌రిచింది. గ్యారెంటీల‌ను తుంగ‌లో తొక్కింది క‌నుకే బ‌డ్జెట్ పేప‌ర్లు చించేశాం. చెవిలో పూలు పెట్టుకుని నిర‌స‌న తెలిపాం. ఈ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు.

అసెంబ్లీ నడిపించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం

అసెంబ్లీ నడిపించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. అసెంబ్లీ సభా నియమాలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. చనిపోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు చెక్ ఇచ్చేందుకు 3 గంటలు సభను వాయిదా వేశారు. ప్రతి రోజు జీరో అవర్ తీసుకుంటామని చెప్పి, రెండు రోజుల నుంచి జీరో అవర్ తీసుకోవడం లేదు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీలో చ‌ర్చ జ‌ర‌ప‌డం లేదు అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement