త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Om Birla | మ‌ళ్లీ స్పీక‌ర్ స్థానాన్ని అధిష్టించిన ఓం బిర్లా

Om Birla | లోక్ సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా (Om Birla)పై ప్రతిపక్ష పార్టీలు ప్ర‌వేశ‌పెట్టిన‌ అవిశ్వాస తీర్మానం (no-confidence motion) వీగిపోయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మ‌ళ్లీ త‌న స్థానాన్ని అధిష్టించారు.

D

National | Published On Mar 12, 2026, 11.45 am IST

Om Birla | మ‌ళ్లీ స్పీక‌ర్ స్థానాన్ని అధిష్టించిన ఓం బిర్లా
Advertisement

Om Birla | లోక్ సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా (Om Birla)పై ప్రతిపక్ష పార్టీలు ప్ర‌వేశ‌పెట్టిన‌ అవిశ్వాస తీర్మానం (no-confidence motion) వీగిపోయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మ‌ళ్లీ త‌న స్థానాన్ని అధిష్టించారు. ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు స‌మావేశాలు ప్రారంభంకాగానే ఓం బిర్లా స్పీక‌ర్ స్థానంలో కూర్చుకున్నారు. గత రెండు రోజులుగా జరిగిన చర్చపై తాను కూడా త‌న అభిప్రాయాన్ని వెల్లడిస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత స‌భ‌ను 12 గంట‌ల వ‌ర‌కూ వాయిదా వేశారు.

కాగా, లోక్ సభ స్పీకర్‌పై ప్రతిపక్ష పార్టీల అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఉండకూడదని, ఆయన్ను ఆ పదవి నుంచి దింపేయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు లోక్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ తీర్మానంపై మంగళవారం నుంచి చర్చ జరుగగా.. బుధవారం వీగిపోయింది. వాయిస్ ఓటు ద్వారా లోక్ సభ ఎంపీలు తమ వాణిని వినిపించగా అత్యధిక సభ్యులు ఆయన స్పీకర్‌గా ఉండేందుకు ఎస్ చెప్పడంతో ఆ తీర్మానాన్ని లోక్ సభ తిరస్కరించింది.

ఓ వైపు ఎంపీలు తమ ఓటు వినిపిస్తుండగానే ప్రతిపక్ష సభ్యులు గగ్గోలు పెట్టారు. స్లోగాన్స్ వదులుతూ హడావుడి చేశారు. అయినా ఎక్కువ మంది ఎంపీలు చేతులెత్తి తమ మద్దతు స్పీకర్‌కు తెలపడంతో ఆ తీర్మానం కాస్త తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత లోక్ సభ వాయిదా పడింది. ఇక త‌న‌పై అవిశ్వాస తీర్మానం తేలే వ‌ర‌కూ స్పీక‌ర్ స్థానంలో కూర్చోన‌ని ఓం బిర్లా గ‌తంలోనే స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. తాజా ప‌రిణామాల‌తో ఆయ‌న త‌న స్థానాన్ని మ‌ళ్లీ అధిష్టించారు. ఇక ఇవాళ ఉద‌యం స‌భ ప్రారంభంకాగానే స్పీక‌ర్ సీట్లో కూర్చుని స‌భా కార్య‌క‌లాపాల‌కు అధ్య‌క్ష‌త వ‌హించారు.

https://x.com/ANI/status/2031969054609850663

Also Read..

Iran Conditions | ఇరాన్ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. యుద్ధం ముగింపున‌కు మూడు ష‌ర‌తులు

Indian Oil Tankers | బిగ్ రిలీఫ్‌.. హ‌ర్మూజ్ గుండా భార‌త నౌక‌ల ప్ర‌యాణానికి ఇరాన్ అనుమ‌తి

Iran targeted two oil tankers | అమెరికా ఆయిల్ ట్యాంక‌ర్‌పై ఇరాన్‌ సూసైడ్ బోటుతో దాడి.. భార‌తీయుడు మృతి

Advertisement
Advertisement