Skip Toll | వాహనదారులూ జాగ్రత్త.. నంబర్ ప్లేట్ దాచి టోల్ ఎగ్గొట్టాలని చూస్తే 6 రెట్లు కట్టాల్సిందే!
Skip Toll | ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేటు దాచి టోల్ ఎగ్గొట్టాలని (Skip Toll) చూసే వాహనదారులకు కేంద్ర రవాణా శాఖ షాకిచ్చింది. టోల్ ప్లాజాల్లో (Toll Plaza) నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌కు పాల్పడితే 6 రెట్లు టోల్ కట్టాల్సిందేనని స్పష్టంచేసింది.
Skip Toll | త్రినేత్ర న్యూస్: ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేటు దాచి టోల్ ఎగ్గొట్టాలని (Skip Toll) చూసే వాహనదారులకు కేంద్ర రవాణా శాఖ షాకిచ్చింది. టోల్ ప్లాజాల్లో (Toll Plaza) నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌కు (Tampering) పాల్పడితే 6 రెట్లు టోల్ కట్టాల్సిందేనని స్పష్టంచేసింది. అత్యాధునిక సాంకేతికతతో నడిచే మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోల్ ప్లాజాల్లో టోల్ చె చార్జీలు ఎగవేసేందుకు నంబర్ ప్లేట్లను (Number Plates) ట్యాంపరింగ్ చేసే వాహనాలపై జరిమానా (Penalty) విధిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ హెచ్చరించింది. ఈ జరిమానా టోల్ ప్లాజాలో చెల్లించాల్సిన ఫీజు కంటే ఐదు రెట్లు అధికంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్లను మరుగుపరిచినా, ఫాస్టాగ్‌ను ప్రదర్శించకున్నా జరిమానా తప్పదని వెల్లడించింది. చెల్లింపులను ఎగవేసే వాహనాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గుర్తిస్తామని తెలిపింది. ఉదాహరణకు, రూ.100 టోల్ ఎగ్గొట్టే వాహనదారుడు అసలు రూ.100తో పాటు రూ.500 జరిమానా కలిపి మొత్తం రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. టోల్ ఎగవేయాలనే ఉద్దేశంతో కావాలనే ఫాస్టాగ్ (FASTag) అతికించని వారికి కూడా ఇదే జరిమానా వర్తిస్తుంది.
ఆరు రెట్ల టోల్ ఎవరికి..
టోల్ ఎగవేయాలనే స్పష్టమైన ఉద్దేశం ఉన్నట్లు నిర్ధారణ అయిన సందర్భాల్లో మాత్రమే ఈ జరిమానా విధిస్తారు. ఫాస్టాగ్ గుర్తించలేని పరిస్థితుల్లో వాహనం ముందు లేదా వెనుక నంబర్ ప్లేట్లను లేదా రెండింటినీ కప్పివేసినా, ట్యాంపరింగ్ చేసినా ఈ నిబంధన కిందకు వస్తారు. ప్రస్తుతం ఉన్న అన్ని మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోల్ ప్లాజాలతో పాటు భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే ప్లాజాలకు కూడా ఈ నిబంధనను వర్తింపజేయాలని ప్రతిపాదించారు.

ఎలా పట్టుకుంటారు..
ఎంఎల్ఎఫ్ఎఫ్ విధానంలో టోల్ చెల్లించడానికి వాహనాలు ఆగాల్సిన అవసరం లేదు. పైన అమర్చిన (Overhead Gantries) ఫాస్టాగ్ రీడర్లు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలు వాహనాలను గుర్తించి ఆటోమేటిక్‌గా టోల్ వసూలు చేస్తాయి. అయితే, నంబర్ ప్లేట్ మరియు ఫాస్టాగ్ రెండింటినీ గుర్తించలేని పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడే వాహనాలను గుర్తించి, వాటి యజమానుల వివరాలను రాబట్టడానికి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత 'వెహికల్ ఫింగర్‌ప్రింటింగ్' సాంకేతికతను, ప్రభుత్వ వాహన రిజిస్ట్రేషన్ డేటాబేస్ 'వాహన్' (VAHAN) ను ఉపయోగిస్తోంది.
ఫాస్టాగ్‌లో తగినంత బ్యాలెన్స్ లేకపోతే?
ఫాస్టాగ్ లావాదేవీ విఫలమైనంత మాత్రాన దానిని ఉద్దేశపూర్వక టోల్ ఎగవేతగా పరిగణించరు. ప్రస్తుత టోల్ నిబంధనల ప్రకారం, చెల్లించని టోల్ రుసుముల కోసం వాహనదారులకు ఎలక్ట్రానిక్ నోటీసులు (e-notices) జారీ చేస్తారు. నోటీసు అందిన 72 గంటలలోపు చెల్లిస్తే కేవలం అసలు టోల్ మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. ఆ గడువు దాటితే చెల్లించాల్సిన మొత్తం రెట్టింపు అవుతుంది.
సంబంధిత వార్తలు

Indian Army microlight aircraft | రన్‌వేపై నాలుగు విమానాలు ల్యాండింగ్.. భారత సైన్యం అసాధారణ ఫీట్..!
నవంబర్ 26, 2026

Uday Krishna Reddy | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో మలుపు.. ఏ2గా సోదరుడు ప్రణయ్
నవంబర్ 24, 2026

Vehicle Insurance | వాహనదారులకు కీలక అలర్ట్.. బీమా లేకుండా టోల్‌ప్లాజా దాటితే ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లు
నవంబర్ 17, 2026
తాజావార్తలు
- ●Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..
- ●DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..
- ●Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!
- ●M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..
- ●MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు
- ●Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు

Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..

DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..

Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!

M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..



