Iran targeted two oil tankers | అమెరికా ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ సూసైడ్ బోటుతో దాడి.. భారతీయుడు మృతి
Iran targeted two oil tankers | దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం భగభగ మండుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దళాలు దాడులను తీవ్రతరం చేశాయి.
International | Published On Mar 12, 2026, 10.31 am IST
Iran targeted two oil tankers | దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం భగభగ మండుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దళాలు దాడులను తీవ్రతరం చేశాయి. అదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ మిత్ర దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులను పెంచింది. తాజాగా ఇరాక్ (Iraq) తీరంలో రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడి చేసింది (Iran targeted two oil tankers). ఈ దాడిలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఇరాక్ ప్రాదేశిక జలాల్లోని ఖోర్ అల్ జుబైర్ (Khor Al Zubair) ఓడరేవు సమీపంలో రెండు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. దాడికి గురైన నౌకలు అమెరికాకు చెందిన 'సేఫ్‌సీ విష్ణు' (Safesea Vishnu), గ్రీస్‌కు చెందిన జెఫిరోస్ (Zefyros)గా గుర్తించారు. ఈ నౌకలకు ఓడరేవు సమీపంలో చమురు సేకరిస్తున్న సమయంలో పేలుడు పదార్థాలు నింపిన నౌక ఢీ కొట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడి తర్వాత భారీగా మంటలు చెలరేగాయి. ఆ నౌకలు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ట్యాంకర్ ట్రాకింగ్ వెబ్‌సైట్ (TankerTrackers.com) ప్రకారం.. ఈ రెండు నౌకల్లో సుమారు 4,00,000 బ్యారెళ్ల ఇరాకీ ముడి చమురు ఉన్నట్లు సమాచారం.
ఈ దాడిలో ఓ భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఈ ప్రమాదం నుంచి సుమారు 27 మంది సిబ్బందిని రక్షించి ఇరాక్ నగరమైన బాస్కాకు తరలించారు. ఇక ఈ దాడి తమ పనే అని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. దాడికి గురైన అమెరికాకు చెందిన నౌక 'సేఫ్‌సీ ట్రాన్స్‌పోర్ట్ ఇంక్' (Safesea Transport Inc) యాజమాన్యానికి చెందినది. ఇది మార్షల్ ఐలాండ్స్ జెండాతో ప్రయాణిస్తోంది. ఇక జెఫిరోస్‌ను గ్రీస్ దేశానికి చెందిన సంస్థ నడుపుతోంది. ఇది మాల్టా జెండాతో ప్రయాణిస్తోంది. ఇరాన్ జరిపిన ఆత్మాహుతి నౌక దాడిలో భారతీయుడు మరణించడం పట్ల సేఫ్‌సీ సంస్థ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
https://x.com/disclosetv/status/2031870366092497008
Also Read..
చిక్కుల్లో హార్దిక్ పాండ్యా.. జాతీయ జెండాను అవమానించాడంటూ పోలీసులకు ఫిర్యాదు
సుదూర ప్రయాణాలకు వందే భారత్ స్లీపర్ రైలు.. ఫ్లయిట్ టికెట్ల తరహాలోనే కన్ఫర్మ్ టికెట్..!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

US Senate | ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్ దూకుడుకు అమెరికా సెనేట్ బ్రేక్
మే 20, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

PM Modi | ఇది 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనం.. ప్రధాని పొదుపు సూచనలపై విపక్షాలు ఫైర్
మే 11, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



