Iran Conditions | ఇరాన్ కీలక ప్రకటన.. యుద్ధం ముగింపునకు మూడు షరతులు
Iran Conditions | ఇరాన్ అధ్యక్షుడు ( Iranian president) మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian ) సోషల్ మీడియాలో కీలక ప్రకటన చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ ద్వారా రాజుకున్న ఈ యుద్ధాన్ని ముగించేందుకు మూడు మార్గాలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు.
International | Published On Mar 12, 2026, 11.28 am IST
Iran Conditions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. దాడులు, ప్రతిదాడులు మరింత తీవ్రతరమవుతున్నాయి. ఈ యుద్ధంపై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. యుద్ధాన్ని ముగించాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు సూచిస్తున్నాయి. లేదంటే ఈ ఉద్రిక్తతలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయని హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ ముందుకొచ్చింది. అయితే, అందుకు మూడు షరతులు (Iran Conditions) విధించింది.
ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు ( Iranian president) మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian ) సోషల్ మీడియాలో కీలక ప్రకటన చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ ద్వారా రాజుకున్న ఈ యుద్ధాన్ని ముగించేందుకు మూడు మార్గాలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను గుర్తించడం, యుద్ధ నష్టపరిహారం చెల్లించడం, భవిష్యత్తులో తమ దేశంపై ఎలాంటి దురాక్రమణలు జరగవని అంతర్జాతీయ హామీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మూడింటికీ ఒప్పుకుంటే యుద్ధానికి ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో అంతకంతకూ పెరుగుతున్న ఉద్రిక్తతల వేళ ఇరాన్ ఇలాంటి ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతేకాదు, ప్రాంతీయ శాంతి పట్ల ఇరాన్ తన నిబద్ధతను చాటుకుందని పెజెష్కియాన్ పేర్కొన్నారు. పొరుగు దేశాలతో ఘర్షణ తాము కోరుకోవడం లేదని చెప్పారు. తమ భూభాగంపై దాడులు చేయడానికి ఉపయోగించే స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న బలవంతపు యుద్ధం, సైనిక దురాక్రమణ సమస్యలను అంతర్జాతీయ సమాజం పరిష్కరించకపోతే ప్రపంచ భద్రత అస్థిరంగా మారుతుందని పెజెష్కియాన్ హెచ్చరించారు.
https://x.com/drpezeshkian/status/2031794088526168170
Also Read..
బిగ్ రిలీఫ్.. హర్మూజ్ గుండా భారత నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతి
అమెరికా ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ సూసైడ్ బోటుతో దాడి.. భారతీయుడు మృతి
చిక్కుల్లో హార్దిక్ పాండ్యా.. జాతీయ జెండాను అవమానించాడంటూ పోలీసులకు ఫిర్యాదు
సంబంధిత వార్తలు

US Senate | ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్ దూకుడుకు అమెరికా సెనేట్ బ్రేక్
మే 20, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

PM Modi | ఇది 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనం.. ప్రధాని పొదుపు సూచనలపై విపక్షాలు ఫైర్
మే 11, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



