త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Oil Tankers | బిగ్ రిలీఫ్‌.. హ‌ర్మూజ్ గుండా భార‌త నౌక‌ల ప్ర‌యాణానికి ఇరాన్ అనుమ‌తి

Indian Oil Tankers | చ‌మురు స‌ర‌ఫ‌రా విష‌యంలో భార‌త్‌కు తాజాగా భారీ ఊర‌ట ల‌భించింది. క్రూడాయిల్ ర‌వాణాకు కీల‌కంగా ఉన్న హ‌ర్మూజ్ గుండా భార‌త చ‌మురు నౌక‌ల సుర‌క్షిత ప్ర‌యాణానికి (Indian Oil Tankers) ఇరాన్ (Iran) అనుమ‌తిచ్చింది.

D

National | Published On Mar 12, 2026, 10.58 am IST

Indian Oil Tankers | బిగ్ రిలీఫ్‌.. హ‌ర్మూజ్ గుండా భార‌త నౌక‌ల ప్ర‌యాణానికి ఇరాన్ అనుమ‌తి
Advertisement

Indian Oil Tankers | ప‌శ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం త‌లెత్తింది. చ‌మురు ర‌వాణాకు కీల‌క‌మైన హ‌ర్మూజ్ జ‌ల‌సంధి (Strait of Hormuz) మూసివేయ‌డంతో ఈ ప‌రిస్థితి త‌లెత్తింది. ఈ మార్గం గుండా ప్ర‌యాణించే చ‌మురు ట్యాంక‌ర్లు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి. దీంతో ముడి చ‌మురు ధ‌ర భారీగా పెరిగింది. ఈ నేప‌థ్యంలో చ‌మురు స‌ర‌ఫ‌రా విష‌యంలో భార‌త్‌కు తాజాగా భారీ ఊర‌ట ల‌భించింది. క్రూడాయిల్ ర‌వాణాకు కీల‌కంగా ఉన్న హ‌ర్మూజ్ గుండా భార‌త చ‌మురు నౌక‌ల సుర‌క్షిత ప్ర‌యాణానికి (Indian Oil Tankers) ఇరాన్ (Iran) అనుమ‌తిచ్చింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar), ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి (Abbas Araghchi) మధ్య జరిగిన దౌత్య‌ చర్చలు ఫ‌లించాయి. ఈ చ‌ర్చ‌ల అనంత‌రం ఈ కీలక నిర్ణ‌యం వెలువ‌డిన‌ట్లు జాతీయ మీడియా పేర్కొంటోంది.

భార‌త్‌కు చెందిన పుష్ప‌క్‌, ప‌రిమ‌ల్ అనే ఇండియ‌న్ ట్యాంక‌ర్లు వ్యూహాత్మ‌కంగా కీల‌క‌మైన ఈ జ‌లసంధి గుండా సుర‌క్షితంగా ప్ర‌యాణిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే, అమెరికా, యూర‌ప్‌, ఇజ్రాయెల్ దేశాల‌కు చెందిన నౌక‌ల‌పై మాత్రం ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. మ‌రోవైపు సౌదీ అరేబియా నుంచి ముడి చ‌మురుతో లైబీరియా జెండా ఉన్న ఓ ట్యాంక‌ర్ రెండు రోజుల క్రిత‌మే హ‌ర్మూజ్ జ‌ల‌సంధిని దాటి ముంబై ఓడ‌రేవుకు చేరుకున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ దేశాలు దాడి మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి ఈ సముద్ర మార్గంలో దాదాపుగా అన్ని నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశానికి చేరుకోవాల్సిన నౌక సురక్షితంగా ఈ మార్గాన్ని దాటడం ఇదే మొదటిసారి కావ‌డం విశేషం.

Also Read..

అమెరికా ఆయిల్ ట్యాంక‌ర్‌పై ఇరాన్‌ సూసైడ్ బోటుతో దాడి.. భార‌తీయుడు మృతి

చిక్కుల్లో హార్దిక్ పాండ్యా.. జాతీయ జెండాను అవమానించాడంటూ పోలీసుల‌కు ఫిర్యాదు

సుదూర ప్రయాణాలకు వందే భారత్‌ స్లీపర్‌ రైలు.. ఫ్లయిట్‌ టికెట్ల తరహాలోనే కన్ఫర్మ్‌ టికెట్‌..!

Advertisement
Advertisement