త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

No Trust Motion Against Speaker | లోక్ సభలో వీగిపోయిన స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం

లోక్ సభ సమావేశాలు జరిగినప్పుడు విధిగా సభకు హాజరు కావడం సభ్యుడి కర్తవ్యం. కానీ.. 16వ లోక్ సభ అటెండెన్స్ చూస్తే యావరేజ్ 80 శాతం కాగా, రాహుల్ గాంధీ హాజరు 52 శాతమే. ప్రస్తుతం 17వ లోక్ సభలో సగటు 66 శాతం కాగా, రాహుల్ గాంధీ హాజరు 51 శాతమే.. అని కేంద్ర మంత్రి అమిత్ షా మండిపడ్డారు.

J

National | Published On Mar 11, 2026, 8.17 pm IST

No Trust Motion Against Speaker | లోక్ సభలో వీగిపోయిన స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం
Advertisement

No Trust Motion Against Speaker | లోక్ సభ స్పీకర్‌పై ప్రతిపక్ష పార్టీల అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఉండకూడదని, ఆయన్ను ఆ పదవి నుంచి దింపేయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు లోక్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ తీర్మానంపై మంగళవారం నుంచి చర్చ జరుగగా.. బుధవారం వీగిపోయింది. వాయిస్ ఓటు ద్వారా లోక్ సభ ఎంపీలు తమ వాణిని వినిపించగా అత్యధిక సభ్యులు ఆయన స్పీకర్‌గా ఉండేందుకు ఎస్ చెప్పడంతో ఆ తీర్మానాన్ని లోక్ సభ తిరస్కరించింది. ఓ వైపు ఎంపీలు తమ ఓటు వినిపిస్తుండగానే ప్రతిపక్ష సభ్యులు గగ్గోలు పెట్టారు. స్లోగాన్స్ వదులుతూ హడావుడి చేశారు. అయినా ఎక్కువ మంది ఎంపీలు చేతులెత్తి తమ మద్దతు స్పీకర్‌కు తెలపడంతో ఆ తీర్మానం కాస్త తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత లోక్ సభ వాయిదా పడింది. గురువారం ఉదయం 11 గంటలకు లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా మళ్లీ తన చైర్‌లో కూర్చోనున్నారు.

Opposition no trust motion against speaker defeated in lok sabha

No Trust Motion Against Speaker | ప్రతిపక్షాలపై అమిత్ షా ఫైర్

లోక్ సభ స్పీకర్‌ అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర మంత్రి అమిత్ షా తిప్పికొట్టారు. లోక్ సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది పార్లమెంటరీ రాజకీయాల్లోనే అత్యంత దుర్దినం అన్నారు. లోక్ సభ స్పీకర్‌కు అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం రెండు వైపుల నుంచి మద్దతు లభిస్తేనే ఎంపిక జరుగుతుంది. ఒక్కసారి ఆ చైర్‌లో కూర్చున్నాక స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం. కానీ.. స్పీకర్ మీదనే ఆరోపణలు చేయడం ప్రజాస్వామ వ్యవస్థను ప్రశ్నించినట్టే అని అమిత్ షా మండిపడ్డారు.

Opposition no trust motion against speaker defeated in lok sabha

రాహుల్ గాంధీకి లోక్ సభలో మాట్లాడటం ఇష్టం ఉండదు

లోక్ సభ సమావేశాలు జరిగినప్పుడు విధిగా సభకు హాజరు కావడం సభ్యుడి కర్తవ్యం. కానీ.. 16వ లోక్ సభ అటెండెన్స్ చూస్తే యావరేజ్ 80 శాతం కాగా, రాహుల్ గాంధీ హాజరు 52 శాతమే. ప్రస్తుతం 17వ లోక్ సభలో సగటు 66 శాతం కాగా, రాహుల్ గాంధీ హాజరు 51 శాతమే. తనను సభలో మాట్లాడనివ్వడం లేదని రాహుల్ బాధపడుతున్నారు కానీ అసలు విషయం ఏంటంటే ఆయనకు సభలో మాట్లాడటం ఇష్టం ఉండదు. ముఖ్యమైన సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయన విదేశాలకు వెళ్తారు.. సభకే రారు కానీ.. తనకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం లేదు అని ఆరోపణ చేస్తారు అంటూ అమిత్ షా.. రాహుల్‌ గాంధీపై నిప్పులు చెరిగారు.

Advertisement
Advertisement