M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..
M Revanth Reddy | రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పెట్టుబడుల కోసమే సదస్సులు నిర్వహించడం లేదని, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించి ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నామని తెలిపారు.
- పెట్టుబడులతో పాటు ప్రకృతికీ ప్రాధాన్యం
- నిపుణుల సూచనలతో పాలసీ..
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
M Revanth Reddy | రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పెట్టుబడుల కోసమే సదస్సులు నిర్వహించడం లేదని, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించి ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రకృతి పరిరక్షణ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని బేగంపేట ఐటీసీ గ్రాండ్ కాకతీయలో నిర్వహించిన ‘తెలంగాణ క్లైమేట్ కాన్‌క్లేవ్’ కర్టెన్‌రైజర్ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికతలు అభివృద్ధి చెందాయని, సహజ వనరులను విధ్వంసం చేస్తే సునామీలు, కరువు వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని హెచ్చరించారు. ప్రకృతితో సమతుల్యత పాటించకపోతే భవిష్యత్ తరాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
పెట్టుబడులతో పాటు ప్రకృతికీ ప్రాధాన్యం
పెట్టుబడుల ఆకర్షణతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో క్లైమేట్ కాన్‌క్లేవ్ నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. శ్రీశ్రీ రవిశంకర్, వాటర్‌మన్ రాజేంద్రసింగ్ సహా పర్యావరణ రంగ నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వారి అభిప్రాయాల ఆధారంగా ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు, ప్రకృతి పరిరక్షణ రెండింటినీ సమతుల్యం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణకు చెరువుల చరిత్ర
తెలంగాణకు జల్, జమీన్, జంగల్ కోసం పోరాడిన చరిత్ర ఉందని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. వందేళ్ల క్రితం కొమురం భీం జల్, జమీన్, జంగల్ కోసం పోరాటం చేశారని పేర్కొన్నారు. రేచర్ల రుద్రదేవుడు, రాణి రుద్రమదేవి వరంగల్ ప్రాంతంలో అనేక చెరువులను నిర్మించారని, రామప్ప, పాకాల వంటి జలవనరులు నిర్మించారని వివరించారు. కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ అభివృద్ధి చెందిందన్నారు. మన చరిత్ర నుంచే స్ఫూర్తి పొందుతున్నామని, గుజరాత్ మోడల్‌ను అనుకరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
చెరువుల పరిరక్షణకు హైడ్రా
కాలక్రమేణా తెలంగాణలో అనేక చెరువులు కనుమరుగయ్యాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల పరిరక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేశామని తెలిపారు. చెరువుల కబ్జాలను అడ్డుకునే క్రమంలో ఆక్రమణదారులతో పాటు న్యాయపరమైన సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నామని చెప్పారు. ధనవంతులు ఇళ్లు, ఫంక్షన్ హాళ్ల నిర్మాణాల కోసం చెరువులను ఆక్రమించారని పేర్కొన్నారు. బతుకమ్మ కుంటను పరిరక్షించడంతో అక్కడ మళ్లీ బతుకమ్మ వేడుకలు నిర్వహించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. హైటెక్ సిటీ సమీపంలోని తమ్మిడికుంట చెరువును కూడా కాపాడామని, ఆక్రమణలను తొలగించి చెరువు స్థలాన్ని పరిరక్షించామని తెలిపారు. ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిందని గుర్తుచేశారు.

పేదలకు అన్యాయం జరగనివ్వం
చెరువుల ఆక్రమణల కారణంగా వరద నీరు వెళ్లేందుకు మార్గం లేక కాలనీల్లోకి ప్రవేశించి ప్రజలను ముంచెత్తుతోందని సీఎం వివరించారు. చెరువుల పరిరక్షణ విషయంలో పేదలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు. నష్టపోయిన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని, మూసీ నది గర్భంలో నివసిస్తున్న పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించామని తెలిపారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కొందరు కనీస జీవన ప్రమాణాలు కూడా లేని దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మూసీ నదిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..
- ●DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..
- ●Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!
- ●MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు
- ●Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు
- ●Crime News | అండదానం ముసుగులో అక్రమ నెట్వర్క్!

Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..

DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..

Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!

MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు




